- రెండు ఇంజిన్ ఆప్షన్లతో అందించబడిన మోంటే కార్లో మోడల్
- దీంతో పాటుగా స్పోర్ట్ లైన్ ఎడిషన్ లాంచ్
మోంటే కార్లో మరియు స్పోర్ట్స్ ఎడిషన్ అనే రెండు వెర్షన్లను స్లావియా లైనప్ కి పరిచయం చేసి స్కోడా కంపెనీ స్లావియా లైనప్ ని అప్ డేట్ చేసింది. మొదటి మోంటే కార్లో కారు రూ.15.79 లక్షల ఎక్స్-షోరూం ధరతో కస్టమర్లకు అందుబాటులోకి వచ్చింది. కొత్త ఎడిషన్ ద్వారా, స్లావియా సెడాన్ కొత్త ఎడిషన్‌తో, స్లావియా సెడాన్ కుషాక్ మోంటే కార్లోకు తగ్గట్లుగా కాస్మెటిక్ అప్‌గ్రేడ్స్ ద్వారా బెనిఫిట్స్ పొందింది.
ఎక్స్‌టీరియర్ పరంగా, స్లావియా మోంటే కార్లో కారు బయటి వైపు బ్లాక్డ్-అవుట్ గ్రిల్, ఓఆర్‌వీఎంలు, రూఫ్, విండో గార్నిష్, ఫాగ్ ల్యాంప్ గార్నిష్ మరియు టెయిల్ గేట్‌పై లెటరింగ్ వంటి అంశాలను పొందింది. ఇతర డిజైన్ అంశాల గురించి చెప్పాలంటే, ఈ మోడల్ ఫెండర్లపై మోంటే కార్లో బ్యాడ్జిని, డార్క్ కలర్ లో ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్, బ్లాక్ స్పోర్టీ డిఫ్యూజర్, ఫ్రంట్ మరియు సైడ్ స్కర్టింగ్, బ్లాక్ కలర్ ఫినిషింగ్ తో 16-ఇంచ్ అల్లాయ్ వీల్స్ మరియు డోర్ హ్యాండిల్స్‌పై డార్క్ క్రోమ్ యాక్సెంట్ వంటి వాటిని పొంది అద్బుతమైన లుక్ ని కలిగి ఉంది.
ఇంటీరియర్ పరంగా, మోంటే కార్లో కారు లోపలి భాగంలోని డ్యాష్‌బోర్డు, సెంటర్ కన్సోల్ మరియు సీట్ అప్హోల్స్టరీపై రెడ్ కలర్ యాక్సెంట్స్ తో ఆల్-బ్లాక్ థీమ్ ని పొందగా, ఇతర ఇంటీరియర్ ఫీచర్ హైలైట్లలో 10-ఇంచ్ ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్, ఎనిమిది స్పీకర్లు, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ ప్యానెల్, అల్యూమినియం పెడల్స్, మోంటే కార్లో ఇన్‌స్క్రిప్షన్‌తో కూడిన ఫ్రంట్ స్కఫ్ ప్లేట్లు, పవర్డ్ మరియు వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు మరియు డార్క్ డోర్ ట్రిమ్స్ వంటివి ఉన్నాయి.
మెకానికల్ గా, స్కోడా స్లావియా మోంటే కార్లో కారును 1.0-లీటర్ టిఎస్ఐ పెట్రోల్ ఇంజిన్ మరియు 1.5-లీటర్ టిఎస్ఐ పెట్రోల్ ఇంజిన్ తో పొందవచ్చు. అలాగే, మొదటి 1.0-లీటర్ టిఎస్ఐ పెట్రోల్ ఇంజిన్ 6-స్పీడ్ మాన్యువల్ మరియు 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ యూనిట్ తో జతచేయబడి రాగా, 1.5-లీటర్ టిఎస్ఐ పెట్రోల్ ఇంజిన్ 7-స్పీడ్ డిసిటి గేర్ బాక్సుతో జతచేయబడి వచ్చింది.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్