- పవర్డ్ ఫ్రంట్ సీట్స్, ఫుట్ వెల్ లైటింగ్, మరియు సబ్ వూఫర్ ఇందులో ప్రత్యేకం
- రెండు పవర్ ట్రెయిన్ ఆప్షన్స్ తో వస్తున్న స్లావియా మాట్ ఎడిషన్
మరికొన్ని రోజుల్లో ఇండియా అంతటా పండుగ వాతావరణం కొనసాగనుంది. అయితే, ఇలాంటి సమయంలో ప్రతి ఒక్క కస్టమర్ దృష్టి అంతా కొత్త కార్ మోడల్స్, వాటి ధరలపైనే ఉండనుంది. దీనిని దృష్టిలో ఉంచుకొని ఈ నెల ప్రారంభంలోనే, స్కోడా ఇండియా తమ స్లావియా మోడల్ లైనప్ లోకి కొత్త మాట్ ఎడిషన్ ని పరిచయం చేసింది. దానికి అనుగుణంగా ఇప్పుడు, ఈ ఆటోమేకర్ ఫెస్టివల్ సీజన్ కి కొద్దిరోజుల ముందే వాటి ధరలను కూడా వెల్లడించింది. రూ.40,000 ప్రీమియంతో స్టైల్ వేరియంట్ అందుబాటులో ఉండగా, స్లావియా మాట్ ఎడిషన్ ధరలు రూ.15,11,999 నుండి ప్రారంభమై మరియు రూ.19,11,999 వరకు ఉండనున్నాయి.(రెండింటి ధరలు, ఎక్స్-షోరూం)
ఈ స్పెషల్ ఎడిషన్ డోర్ హ్యాండిల్స్ మరియు ఓఆర్విఎంలపై గ్లోస్ బ్లాక్ కాంట్రాస్టింగ్ హైలెట్స్ లో మాట్ ఫినిష్ కార్బన్ స్టీల్ ఎక్స్టీరియర్ కలర్ తో రానుంది. లోపల చూస్తే, క్యాబిన్ మొత్తంగా వైర్ లెస్ మొబైల్ కనెక్టివిటీతో 10-ఇంచ్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టం, ప్రత్యేకమైన సబ్ వూఫర్ తో 8-స్పీకర్ సౌండ్ సిస్టం, పవర్డ్ ఫ్రంట్ సీట్స్, మరియు ఇల్యూమినేటెడ్ ఫుట్ వెల్ ఏరియా వంటి కొత్త ఫీచర్స్ ని కలిగి ఉంది.
స్కోడా స్లావియా మాట్ ఎడిషన్ ను రెండు గ్యాసోలిన్ మోటార్స్ తో పొందవచ్చు. ఒకటి 1.0-లీటర్ టిఎస్ఐ పెట్రోల్ మరియు రెండోది 1.5-లీటర్ టిఎస్ఐ పెట్రోల్. ఇంతకు ముందున్న ఎడిషన్ 114bhpమరియు 178Nm టార్క్ను ఉత్పత్తి చేస్తుండగా, ప్రస్తుతం లాంచ్ అయిన మాట్ ఎడిషన్ 148bhp మరియు 250 Nm టార్క్ను ఉత్పత్తి చేస్తుంది. ఇందులో ఉన్న 6-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్, మరియు 7-స్పీడ్ డిఎస్జి గేర్ బాక్స్ ట్రాన్స్మిషన్ విధులను నిర్వహించనున్నాయి.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్