- రివైజ్ చేయబడిన గ్రిల్ మరియు హెడ్‌ల్యాంప్స్ ని పొందనున్న ఫేస్‌లిఫ్ట్
- అదే పవర్‌ట్రెయిన్ ఆప్షన్స్ కొనసాగే వకాశం
టాటా నెక్సాన్, హ్యుందాయ్ వెన్యూ, మహీంద్రా XUV 3XO మరియు మారుతి బ్రెజా వంటి వాటితో పోటీగా స్కోడా ఇండియా కాంపాక్ట్ ఎస్‌యూవీని తయారు చేస్తున్న సంగతి తెలిసిందే. అయినప్పటికీ, ఆటోమేకర్ స్లావియా మరియు కుషాక్ ఎస్‌యూవీతో సహా దాని ప్రస్తుత MQB లైనప్‌ను అప్‌డేట్ చేస్తోంది.
ఇటీవల, స్లావియాటెస్ట్ మ్యూల్ భారీగా కామోఫ్లేజ్ తో కప్పబడి టెస్టింగ్ చేస్తూ కనిపించింది. తొలిసారిగా సరికొత్త, డిజైన్‌తో పాటు సిల్హౌట్ ప్రస్తుత ఇటరేషన్ కంటే కొంచెం అటు ఇటుగా కనిపిస్తుంది. అయితే, దీనిని దగ్గర చూసినట్లయితే, రివైజ్ చేయబడిన ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్‌లతో కూడిన కొత్త, సన్నగా ఉండే గ్రిల్‌ను కలిగి ఉన్న మిడ్-సైజ్ సెడాన్‌ను మనం చూడవచ్చు. అలాగే, ఎల్ఈడీ డిఆర్ఎల్ఎస్ షేప్డ్ లో బూమరాంగ్ డిజైన్‌తో కొత్తగా ఉంటుంది.
ఇతర గుర్తించదగిన అంశాలలో బ్లాక్-అవుట్ మల్టీ-స్పోక్ అల్లాయ్ వీల్స్, షార్క్-ఫిన్ యాంటెన్నా, సన్‌రూఫ్, హాలోజన్ ఫాగ్ ల్యాంప్స్ మరియు ఎల్ఈడీ టెయిల్‌లైట్స్ వంటివి ఉన్నాయి.
అలాగే మరోవైపు, స్లావియా పవర్‌ట్రెయిన్‌లో స్కోడా లో ఎటువంటి మార్పులు చేసే అవకాశం లేదు. ఇది ఇంతకు ముందు లాగే అదే 1.0-లీటర్ మరియు 1.5-లీటర్ టిఎస్ఐ పెట్రోల్ మోటార్‌లతో కొనసాగుతుంది. ఇందులో ట్రాన్స్‌మిషన్ ఆప్షన్స్ విషయానికొస్తే, ఈ ఇంజిన్స్ 6-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ ఆటోమేటిక్ టార్క్ కన్వర్టర్ మరియు 7-స్పీడ్ డిసిటి గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటాయి.
అనువాదించిన వారు: రాజపుష్ప