- 2025 మొదటి త్రైమాసికంలో లాంచ్ కి సిద్ధంగాఉన్న మోడల్
- 1.0-లీటర్ టిఎస్ఐ ఇంజిన్‌తో లభించే అవకాశం
ఈ సంవత్సరం ప్రారంభంలో, స్కోడా ఇండియా సెగ్మెంట్‌లోని టాటా నెక్సాన్, మారుతి బ్రెజా, కియా సోనెట్ ఇతర కాంపాక్ట్ ఎస్‌యువి లతో పోటీ పడేందుకు న్యూ సబ్-ఫోర్ మీటర్ ఎస్‌యువి లాంచ్ చేయనున్నట్లు ప్రకటించింది. డిజైన్ రెండర్‌తో మోడల్‌ను టీజ్ చేస్తూ, ఈ బ్రాండ్ పోటీని ప్రారంభించింది, ఇందులో పాల్గొనేవిఎస్‌యువి పేరును నమోదు చేయడంలో సహకరించవచ్చు.
ఇప్పుడు, ఆటోమేకర్ కయాక్, క్లిక్, కార్మిక్, క్లిక్, కాస్మిక్, కైరోక్, కారిక్, క్విక్, కైమాఖ్, మరియు కైలాఖ్ అనే 10 పేర్లను షార్ట్‌లిస్ట్ చేసింది. 2025 మొదటి త్రైమాసికంలో షెడ్యూల్ చేయబడగా లాంచ్‌కు ముందు కార్ మేకర్ ఈ కార్ పేరును త్వరలో ప్రకటిస్తుంది.
అదేవిధంగా , ఎస్‌యువిఇటీవల దేశవ్యాప్తంగా టెస్టింగ్ చేస్తూ కనిపించింది. ఇది తన పెద్ద ఎంక్యూబి అయిన, కుషాక్ నుండి డిజైన్ పోలికలను పొందింది. కొన్ని డిజైన్ హైలైట్‌లలో నిలువు స్లాట్‌లతో కూడిన స్లీకర్ గ్రిల్, గ్రిల్‌కి పక్కగా ఎల్ఈడీ డిఆర్ఎల్స్, స్ప్లిట్ ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్స్, విశాలమైన రేడియేటర్ గ్రిల్ మరియు స్క్వేర్డ్ ఫ్రంట్ బంపర్ ఉన్నాయి. కారువెనుక భాగంలో, ఎస్‌యువి ఫీచర్స్ లో ఎల్ -షేప్డ్ ఎల్ఈడీ టెయిల్‌ల్యాంప్‌లు, షార్క్ ఫిన్ యాంటెన్నా,పొడిగించిన రూఫ్ రెయిల్స్ మరియు స్టాప్ ల్యాంప్‌తో పొడిగించిన వెనుక స్పాయిలర్‌ను కలిగి ఉంటుంది.
పవర్‌ట్రెయిన్ మరియు స్పెసిఫికేషన్‌ల విషయానికొస్తే, లాంచ్ కానున్నస్కోడా ఎస్‌యువి 6-స్పీడ్ మాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో 1.0-లీటర్ టిఎస్ఐ పెట్రోల్ మోటార్ తో జతచేయబడి రానుంది. ఈ ఇంజిన్ స్లావియా మరియు కుషాక్ మధ్య ట్యూన్ చేయబడగా, ఇందులో ని ఇంజిన్ 114bhp మరియు 178Nm మాక్సిమం టార్క్‌ను ఉత్పత్తి చేయడానికి ట్యూన్ చేయబడింది.
అనువాదించిన వారు: రాజపుష్ప