- 1.0-లీటర్ మరియు 1.5-లీటర్ టిఎస్ఐ ఇంజిన్లతో లభ్యం
- సేఫ్టీ పరంగా 6 ఎయిర్ బ్యాగ్స్ తో వచ్చిన నయా వెర్షన్లు
కుషాక్ మరియు స్లావియా కార్ల రేంజ్ కి ఇప్పుడు స్పోర్ట్ లైన్ వెర్షన్ ని జతచేసి స్కోడా వీటి వేరియంట్లను మరింత విస్తరించింది. ప్రాముఖ్యమైన అంశం ఏంటి అంటే, సెడాన్ మరియు ఎస్‍యూవీలకు ఇది కొత్త వేరియంట్ కాగా, కుషాక్ మరియు స్లావియా కార్లలోని క్లాసిక్, సిగ్నేచర్, మోంటే కార్లో మరియు ప్రెస్టీజ్ వేరియంట్లతో జతచేరింది.
కుషాక్ మరియు స్లావియా కార్లలోని స్పోర్ట్ లైన్ వెర్షన్ మోంటే కార్లో లాగా టెయిల్ లైట్స్, ఎయిరో కిట్, మరియు ఇతర వాటిలో బ్లాక్డ్-అవుట్ డిజైన్ అంశాలను పొందింది. స్లావియా స్పోర్ట్ లైన్ వెర్షన్ R16 బ్లాక్ అల్లాయ్ వీల్స్ ని పొందగా, కుషాక్ స్పోర్ట్ లైన్ వెర్షన్ R17 బ్లాక్ అల్లాయ్ వీల్స్ ని పొందింది. ఈ రెండు కార్లలోని స్పోర్ట్ లైన్ వెర్షన్ మోడల్స్ ఎల్ఈడీ హెడ్ ల్యాంప్స్ మరియు డీఆర్ఎల్స్ ని కూడా పొందాయి. టాప్-స్పెక్ మోడల్ ఆధారంగా చూస్తే, కొత్త వెర్షన్ స్టాండర్డ్ గా 6 ఎయిర్ బ్యాగ్స్ తో వచ్చింది. వీటికి అదనంగా, ఈ కార్లలోని స్పోర్ట్ లైన్ వెర్షన్ ఎలక్ట్రిక్ సన్ రూఫ్, అల్లాయ్ ఫుట్ పెడల్స్, కనెక్టివిటీ డాంగల్, రెయిన్-సెన్సింగ్ వైపర్స్, మరియు ఆటో-డిమ్మింగ్ ఇంటర్నల్ రియర్ వ్యూ మిర్రర్ వంటి ఫీచర్లతో వచ్చింది.
పవర్ ట్రెయిన్ వివరాలు మరియు కాంపీటీషన్
ఇంజిన్ ఆప్షన్లను పరిశీలిస్తే, ఈ రెండు కార్లలోని స్పోర్ట్ లైన్ వెర్షన్లో 1.0-లీటర్ మరియు 1.5-లీటర్ టిఎస్ఐ ఇంజిన్లు లభిస్తాయి. అలాగే, రెండు కార్లు ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ని పొందగా, ఒక్క 1.0-లీటర్ టిఎస్ఐ ఇంజిన్ మాత్రమే 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ ని పొందింది. మొదటి ఇంజిన్ 114bhp మరియు178Nm టార్కును ఉత్పత్తి చేస్తుండగా, రెండవ ఇంజిన్ 148bhp మరియు250Nm టార్కును ఉత్పత్తి చేస్తుంది. స్లావియా స్పోర్ట్ లైన్ వెర్షన్ కారు హోండా సిటీ, హ్యుందాయ్ వెర్నా, మరియు ఫోక్స్‌వ్యాగన్ వంటి కార్లతో పోటీపడుతుండగా, కుషాక్ స్పోర్ట్ లైన్ వెర్షన్ కారు కియా సెల్టోస్, హ్యుందాయ్ క్రెటా, ఫోక్స్‌వ్యాగన్ టైగున్, మరియు ఎంజి ఆస్టర్ వంటి ఎస్‍యూవీ కార్ల నుంచి అతి పెద్ద పోటీని ఎదుర్కొంటుంది.
స్కోడా స్లావియా స్పోర్ట్ లైన్ వెర్షన్ కారు ధరలు
స్కోడా స్లావియా స్పోర్ట్ లైన్ 1.0 టిఎస్ఐ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ – రూ.14.05 లక్షలు
స్కోడా స్లావియా స్పోర్ట్ లైన్ 1.0 టిఎస్ఐ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ -రూ.15.15 లక్షలు
స్కోడా స్లావియా స్పోర్ట్ లైన్ 1.5 టిఎస్ఐ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ - రూ.16.75 లక్షలు
స్కోడా కుషాక్ స్పోర్ట్ లైన్ వెర్షన్ కారు ధరలు
స్కోడా కుషాక్ స్పోర్ట్ లైన్ 1.0 టిఎస్ఐ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ - రూ.14.7 లక్షలు
స్కోడా కుషాక్ స్పోర్ట్ లైన్ 1.0 టిఎస్ఐ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ -రూ.15.8 లక్షలు
స్కోడా కుషాక్ స్పోర్ట్ లైన్ 1.5 టిఎస్ఐ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ - రూ.17.4 లక్షలు
అనువాదించిన వారు: సంజయ్ కుమార్