- ఇండియా కోసం ప్రత్యేకంగా తయారుచేయబడుతున్న సబ్-ఫోర్ మీటర్ కాంపాక్ట్ ఎస్‍యూవీ
- 1.0-లీటర్ టిఎస్ఐ పెట్రోల్ ఇంజిన్ తో రానున్న కైలాక్
రెండు రోజుల క్రితం, స్కోడా కంపెనీ దాని సబ్-ఫోర్ మీటర్ కాంపాక్ట్ ఎస్‍యూవీని కైలాక్ అనే పేరుతో తీసుకువస్తున్నట్లు వెల్లడించింది. ఇప్పుడు మాకు తెలిసింది ఏంటి అంటే, ఫిబ్రవరి-2025 వరకు ఇది ఇండియాలో ఉన్న షోరూంలకు చేరుకోనుంది. అంటే, ఈ కారును సంవత్సరం చివరి లోపు లాంచ్ చేసే అవకాశం ఉంది. అలాగే దీని ప్రొడక్షన్ కూడా ప్రారంభంకానుంది. మేము చెబుతుంది ఏంటి అంటే, 2025 సంవత్సరం జనవరి రెండవ వారంలో జరగనున్న భారత్ మొబిలిటీ ఎక్స్ పోలో స్కోడా కంపెనీ కొత్త సబ్-ఫోర్ మీటర్ కాంపాక్ట్ ఎస్‍యూవీ కైలాక్ ధరలను ప్రకటించవచ్చు.
ఇండియా 2.0 ప్రోగ్రాం కింద స్కోడా దాని మూడవ కారు కైలాక్ ని తీసుకువస్తుండగా, ఇది 113bhp మరియు175Nm టార్కును ఉత్పత్తి చేసే 1.0-లీటర్ టిఎస్ఐ పెట్రోల్ ఇంజిన్ తో అందించబడనుంది. ఈ ఇంజిన్ ని 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ లేదా 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ తో జతచేసి పొందవచ్చు.
ఈ కారు లుక్స్ చూస్తుంటే స్కోడా నుంచి వచ్చిన కుషాక్ లాగా అనిపిస్తుంది. కానీ, సబ్-ఫోర్ మీటర్ పొడవుకు అనుగుణంగా సి-పిల్లర్ సి-పిల్లర్ తర్వాత ఇది చిన్నదిగా ఉండవచ్చు. చాలా వరకు క్యాబిన్ మరియు ఫీచర్ లిస్టు ఏమాత్రం తేడా లేకుండా అలాగే వస్తుందని భావిస్తుండగా, దీనిని సెగ్మెంట్ లో ప్రీమియం కారుగా అందించే అవకాశం ఉంది.
కైలాక్ కారు లాంచ్ తర్వాత, హ్యుందాయ్ వెన్యూ, కియా సోనెట్, మారుతి ఫ్రాంక్స్, మారుతి బ్రెజా, టయోటా టైజర్, మరియు మహీంద్రా XUV 3XO వంటి కార్లకు గట్టిపోటీని ఇవ్వనుంది.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్