- 2025 సంవత్సరం ప్రారంభంలో ప్రకటించబడనున్న కైలాక్ ధరలు
- నెక్సాన్, వెన్యూ, బ్రెజా మరియు సోనెట్ కార్లతో పోటీ పడనున్న కైలాక్
ఈ వారం ప్రారంభంలో, స్కోడా ఆటో ఇండియా దాని మూడవ కారును కైలాక్ అనే కొత్త పేరుతో MQB-A0-IN ప్లాట్‌ఫారమ్ పై తీసుకువస్తున్నట్లు ప్రకటించింది. వెబ్‌లో షేర్ చేసిన కొత్త స్పై షాట్‌లలో వచ్చే ఏడాది ప్రారంభంలో అప్ కమింగ్ (రాబోయే) ఈ కారు కీలక ఫీచర్‌తో అందించబడుతుందని వెల్లడైంది.
ప్రస్తుతం ఇండియన్ మార్కెట్లో అత్యంత కాంపిటీటివ్ ఉన్న సెగ్మెంట్లలో ఒకటైన కైలాక్ సబ్-ఫోర్-మీటర్ ఎస్‍యూవీ, హ్యుందాయ్ వెన్యూ, టాటా నెక్సాన్, రెనాల్ట్ కిగర్, కియా సోనెట్, నిస్సాన్ మాగ్నైట్, మహీంద్రా, XUV 3XO, మరియు మారుతి బ్రెజా వంటి కార్లకు గట్టిపోటీని ఇవ్వనుంది. అలాగే, స్పై షాట్‌లలో చూసినట్లుగా, కారు సింగిల్ పేన్ ఎలక్ట్రిక్ సన్‌రూఫ్‌ని పొందుతుంది.
2025 స్కోడా కైలాక్ స్పై షాట్ మోడల్ రెడ్ పెయింట్ థీమ్‌లో అందించబడుతుందని, పూర్తి టెయిల్‌లైట్ డిజైన్ కాకపోయినా కనీసం కొంత భాగం వరకు, క్లియర్ లెన్స్ సెటప్‌ను పొందుతుందని సూచిస్తుంది. మరోవైపు, ఇది రూఫ్ రెయిల్స్, షార్క్-ఫిన్ యాంటెన్నా, కొద్దిగా రేక్ చేయబడిన సి-పిల్లర్స్ మరియు టెయిల్‌గేట్-మౌంటెడ్ నెంబర్ ప్లేట్ హోల్డర్ వంటివి పొందుతుంది. ఇప్పటికే మునుపటి టీజర్‌లు ఈ కారు ,స్ప్లిట్ హెడ్‌ల్యాంప్ డిజైన్, కొత్త ఎల్ఈడీ డిఆర్ఎల్స్ మరియు ఇన్‌వర్టెడ్ ఎల్- షేప్డ్ ఎల్ఈడీటెయిల్‌లైట్‌లతో వస్తున్నట్లు నిర్ధారించాయి.
స్కోడా స్లావియా మరియు కుషాక్‌లు వచ్చిన అదే ప్లాట్‌ఫారమ్ ఆధారంగా వస్తున్న మోడల్ సబ్-ఫోర్ మీటర్- ఎస్‍యూవీకి వర్తించే ట్యాక్స్ బ్రాకెట్‌ల ప్రయోజనాలను పొందేందుకు ప్రత్యేకంగా 1.0-లీటర్, మూడు-సిలిండర్, టిఎస్ఐ పెట్రోల్ ఇంజిన్‌తో అందుబాటులో ఉండే అవకాశం ఉంది. సబ్-ఫోర్ మీటర్ ఎస్‍యూవీలో 114bhp మరియు 178Nm టార్క్‌ను ఉత్పత్తి చేసే మోటార్, 6-స్పీడ్ మాన్యువల్ మరియు టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ యూనిట్ల ద్వారా ముందు చక్రాలకు పవర్ ని సప్లై చేస్తుందని భావిస్తున్నాం.
అనువాదించిన వారు: రాజపుష్ప