- నెక్సాన్, మాగ్నైట్, మరియు మరెన్నో వాటితో పోటీగా వస్తున్న కైలాక్
- వచ్చే సంవత్సరం ప్రారంభంలో లాంచ్
వచ్చే సంవత్సరం ప్రారంభంలో స్కోడా కంపెనీ దాని సబ్-ఫోర్-మీటర్ ఎస్‍యూవీని ఇండియన్ మార్కెట్ కి పరిచయం చేయనుంది. 2025లో అరంగేట్రం చేయనుండగా, దాని కంటే ముందుగా, టాటా నెక్సాన్, రెనాల్ట్ కైగర్, మారుతి బ్రెజా, కియా సోనెట్, హ్యుందాయ్ వెన్యూ, మరియు మహీంద్రా XUV 3XO వంటి కార్లతో పోటీపడుతున్న కైలాక్ కారు మొదటి టీజర్ ని కార్ మేకర్ రిలీజ్ చేసింది.
టీజర్లలో చూసిన విధంగా, స్కోడా కైలాక్ కారు గ్రీన్ మరియు బ్లాక్ థీమ్ తో భారీగా కామోఫ్లేజ్ తో కప్పబడి ఉంది. ఈ కారులో మనం గుర్తించాల్సిన అంశాలలో కారుకు ఇరువైపులా ఎల్ఈడీ డీఆర్ఎల్స్ తో సిగ్నేచర్ మల్టీ-స్లాట్ గ్రిల్, కొత్త ఎల్ఈడీ ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్, మరియు ఫ్రెష్ ఫ్రంట్ మరియు రియర్ బంపర్స్ వంటివి ఉన్నాయి. అంతే కాకుండా, ఈ కారు రూఫ్ రెయిల్స్, రియర్ డిస్క్ బ్రేక్స్, కొత్త బ్లాక్డ్-అవుట్ అల్లాయ్ వీల్స్, ఎల్ఈడీ ఇన్సర్ట్ లతో పెంటగాన్-షేప్డ్ టెయిల్ లైట్స్ మరియు కొత్త టెయిల్ గేట్ వంటి వాటిని పొందింది.
ఇంటీరియర్ పరంగా, కొత్త కైలాక్ కారు, దీని లోపల, భారీ ఫ్రీ స్టాండింగ్ టచ్ స్క్రీన్ యూనిట్, వర్చువల్ కాక్ పిట్, వైర్ లెస్ యాపిల్ కార్ ప్లే, మరియు ఆండ్రాయిడ్ ఆటో, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్స్, మరియు రియర్ ఏసీ వెంట్స్ వంటి ఫీచర్లను పొందే అవకాశం ఉంది.
సబ్-ఫోర్-మీటర్ వెహికిల్ రూల్స్ బెనిఫిట్స్ నిమిత్తం, 2025 స్కోడా కైలాక్ లోని 1.0-లీటర్, 3-సిలిండర్, టిఎస్ఐ పెట్రోల్ ఇంజిన్ 6-స్పీడ్ మాన్యువల్ మరియు టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్లతో జతచేయబడి వచ్చే అవకాశం ఉంది. ఈ ఇంజిన్, ప్రస్తుత కండీషన్లో 114bhp మరియు 178Nm టార్కును ఉత్పత్తి చేస్తుంది.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్