- లిమిటెడ్ పీరియడ్ వరకు మాత్రమే చెల్లుబాటులో ఉన్న కొత్త ధర
- మిడ్-సైజ్ ఎస్‌యువి వేరియంట్ పేర్లను కూడా అప్‌డేట్ లో భాగంగా చేర్చిన స్కోడా
స్కోడా ఆటో ఇండియా దాని రేంజ్ లో కుషాక్ మరియు స్లావియా పై భారీ ధర తగ్గింపును ప్రకటించి తక్షణమే అమలులోకి తీసుకువచ్చింది. అలాగే, బ్రాండ్ తరపు నుండి అత్యంత చవకగా లభిస్తున్న సెడాన్ పై రూ.2.19 లక్షలు (ఎక్స్-షోరూమ్) వరకు ధరలు తగ్గించబడ్డాయి. వీటి వివరాలు మా (కార్‍వాలే) వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి. ఈ కథనంలో, కుషాక్ ధరలలో తగ్గింపు పరిమాణాన్ని మనం చూద్దాం.
ఇంకా చెప్పాలంటే, ఆటోమేకర్ కుషాక్ లోని యాక్టివ్, యాంబిషన్ మరియు స్టైల్ అనే వేరియంట్ పేర్లను వరుసగా క్లాసిక్, సిగ్నేచర్ మరియు ప్రెస్టీజ్ అనే కొత్త వేరియంట్ పేర్లతో అప్ డేట్ చేసింది. మరోవైపు, ఓనిక్స్ మరియు మోంటే కార్లో వేరియంట్‌లలోఎటువంటి మార్పులు లేవు. అలాగే, పాత ధర మరియు కొత్త ధరలులో తేడా మరియు వేరియంట్ వారీగా క్రింద లిస్ట్ చేయబడ్డాయి.
కుషాక్ 1.0 వేరియంట్ | పాత ధర | కొత్త ధర | వ్యత్యాసం |
క్లాసిక్ ఎంటీ | రూ.11.99 లక్షలు | రూ.10.89 లక్షలు | రూ.1.10 లక్షలు |
ఓనిక్స్ ఎంటీ | రూ.12.89 లక్షలు | రూ.12.89 లక్షలు | ధరలో మార్పు లేదు |
ఓనిక్స్ ఏటీ | రూ.13.49 లక్షలు | రూ.13.49 లక్షలు | ధరలో మార్పు లేదు |
సిగ్నేచర్ ఎంటీ | రూ.14.54 లక్షలు | రూ.14.19 లక్షలు | రూ.35,000 |
సిగ్నేచర్ ఏటీ | రూ.15.84 లక్షలు | రూ.15.29 లక్షలు | రూ.55,000 |
మోంటే కార్లో ఎంటీ | రూ.17.29 లక్షలు | రూ.15.60 లక్షలు | రూ.1.69 లక్షలు |
మోంటే కార్లో ఏటీ | రూ.18.59 లక్షలు | రూ.16.70 లక్షలు | రూ. 1.89 లక్షలు |
ప్రెస్టీజ్ ఎంటీ | రూ.16.59 లక్షలు | రూ.16.09 లక్షలు | రూ.50,000 |
ప్రెస్టీజ్ ఏటీ | రూ.17.89 లక్షలు | రూ.17.19 లక్షలు | రూ.70,000 |
కుషాక్ 1.5 వేరియంట్ | పాత ధర | కొత్త ధర | వ్యత్యాసం |
సిగ్నేచర్ ఎంటీ | రూ. 15.99లక్షలు | రూ. 15.69లక్షలు | రూ.30,000 |
సిగ్నేచర్ ఏటీ | రూ. 17.39లక్షలు | రూ. 16.89లక్షలు | రూ.50,000 |
మోంటే కార్లో ఎంటీ | రూ. 19.09 లక్షలు | రూ. 17.10లక్షలు | రూ.1.99 లక్షలు |
మోంటే కార్లో ఏటీ | రూ.20.49లక్షలు | రూ.18.30 లక్షలు | రూ.2.19 లక్షలు |
ప్రెస్టీజ్ ఎంటీ | రూ. 18.39లక్షలు | రూ. 17.59లక్షలు | రూ. 80,000 |
ప్రెస్టీజ్ ఏటీ | రూ. 19.79 లక్షలు | రూ. 18.79లక్షలు | రూ.1లక్షలు |
స్కోడా కుషాక్ 1.0-లీటర్, మూడు-సిలిండర్, టర్బో-పెట్రోల్ ఇంజిన్ మరియు 1.5-లీటర్, నాలుగు-సిలిండర్, టర్బో-పెట్రోల్ ఇంజిన్‌తో అందించబడుతుంది. ఇందులోనిట్రాన్స్‌మిషన్ ఆప్షన్స్ లో 6-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ మరియు 7-స్పీడ్ డిఎస్‍జి బాక్సు ఉన్నాయి.
అనువాదించిన వారు: రాజపుష్ప