- కుషాక్ రేంజ్ లో మరింత చవకగా లభిస్తున్న ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్
- మరిన్ని ఫీచర్లతో కస్టమర్లకు బెనిఫిట్స్
స్కోడా కంపెనీ కుషాక్ ఓనిక్స్ ఎడిషన్ ఆటోమేటిక్ ని రూ.13.49 లక్షల ఎక్స్-షోరూం ధరతో ఇండియాలో లాంచ్ చేసింది. ఈ వేరియంట్ టాప్-ఎండ్ వేరియంట్ల నుంచి మరిన్ని ఫీచర్లతో తీసుకోగా, అందులోని టాప్-5 హైలైట్స్ ఎక్స్‌క్లూజివ్ గా మీకు అందిస్తున్నాం.
ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్స్
ఎంట్రీ-లెవెల్ వేరియంట్లలా కాకుండా కుషాక్ ఓనిక్స్ ఎడిషన్ ఆటోమేటిక్ కన్వెన్షనల్ హెడ్ ల్యాంప్స్, స్పోర్ట్స్ లుక్ ని అందించే డీఆర్ఎల్స్ తో ఎల్ఈడీ హెడ్ ల్యాంప్స్, మరియు కార్నరింగ్ ఫాగ్ ల్యాంప్స్ వంటి వాటిని పొందింది.
టెక్టాన్ వీల్ కవర్
ఈ కారు అల్లాయ్ వీల్స్ తో కాకుండా టెక్టాన్ వీల్ కవర్ తో కూడిన స్టీల్ రిమ్స్ తో వచ్చింది. టాప్-స్పెక్ వేరియంట్లతో పోలిస్తే ఈ ఎడిషన్ తేడాను చాలా ఈజీగా గుర్తించవచ్చు.
ఓనిక్స్ బ్యాడ్జింగ్
రియర్ డోర్ విండో ఫ్రేమ్ మరియు కారు సైడ్ ప్రొఫైల్ లో ఆప్షనల్ డీకాల్ వంటి వాటిని తప్పిస్తే ఇందులో పెద్దగా తేడాలు ఏమీ లేవు. లోపల చూస్తే, ఫ్లోర్ మ్యాట్స్ మరియు కుషన్స్ పై ఓనిక్స్ బ్యాడ్జింగ్ ఉన్నట్లుగా డోర్ సిల్ ప్లేట్స్ పై ఓనిక్స్ బ్యాడ్జింగ్ ని కలిగి ఉంది.
టచ్ ప్యానెల్ తో ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్
ఓనిక్స్ ఎడిషన్ యొక్క మరొక యుఎస్‍పి ఏంటి అంటే, ఇది టచ్ ప్యానెల్ తో ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ యూనిట్ ని పొందింది. ఇందులో లభిస్తున్న ఫీచర్ లోయర్-ఎండ్ వేరియంట్లలో మిస్ అయ్యింది.
టాప్-ఎండ్ యాంబిషన్ ట్రిమ్ ఫీచర్లు
ఓనిక్స్ ఎడిషన్ ఆటోమేటిక్ వేరియంట్ ని కొనుగోలు చేయాలనుకున్న కస్టమర్లు దీనిలో ప్యాడిల్ షిఫ్టర్లు, హిల్ హోల్డ్ కంట్రోల్, మరియు డీఫాగర్ తో రియర్ వైపర్ వంటి ఫీచర్లను పొందుతారు. పైన పేర్కొన్న అన్ని ఫీచర్లు కుషాక్ టాప్-ఎండ్ యాంబిషన్ వేరియంట్లో అందించబడ్డాయి.
కుషాక్ ఓనిక్స్ ఎడిషన్ పవర్ ట్రెయిన్ ఆప్షన్లు
ఇది మొదటిసారిగా గత సంవత్సరం పరిచయం చేయబడింది. ఆ సమయంలో ఓనిక్స్ ఎడిషన్ 6-స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్సు 1.0-లీటర్ టిఎస్ఐ ఇంజిన్ తో మాత్రమే జతచేయబడి అందించబడింది. కొత్త వేరియంట్ ద్వారా ఈ పెట్రోల్ ఇంజిన్ 114bhp మరియు 178Nm టార్కును ఉత్పత్తి చేస్తుంది. అయితే, చివరిగా ఇప్పుడు 6-స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్సుతో కూడా అందుబాటులోకి వచ్చింది.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్