- బెస్ట్ ఫీచర్లతో యాక్టివ్ మరియు యాంబిషన్ వేరియంట్స్ మధ్య నిలిచిన ఓనిక్స్ ఆటోమేటిక్
- 2023లో లాంచ్ అయిన ఓనిక్స్ ఎడిషన్
స్కోడా ఇండియా కుషాక్ ఓనిక్స్ ఆటోమేటిక్ వెర్షన్ ని ఇండియాలో లాంచ్ చేసింది. ఈ కొత్త వేరియంట్ బెస్ట్ ఫీచర్లతో యాక్టివ్ మరియు యాంబిషన్ వేరియంట్స్ మధ్య నిలవగా, దీని ఎక్స్-షోరూం ధర రూ. 13.49 లక్షలుగా ఉంది. ఈ కుషాక్ ఓనిక్స్ ఆటోమేటిక్ వేరియంట్ కేవలం 1.0-లీటర్ టిఎస్ఐ పెట్రోల్ ఇంజిన్ తో మాత్రమే అందించబడింది
కుషాక్ ఎస్‍యూవీ కుషాక్ ఎడిషన్ మొదటగా 2023లో పరిచయం కాగా, ఆ సమయంలో ఇది మాన్యువల్ గేర్ బాక్సుతో మాత్రమే అందించబడింది. ఇప్పుడు, దీని 6-స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్సు 1.0-లీటర్ టిఎస్ఐ పెట్రోల్ ఇంజిన్ తో కూడా జతచేయబడి వచ్చింది. ఈ ఇంజిన్ 114bhp మరియు 178Nm మాక్సిమం టార్కును ఉత్పత్తి చేస్తుంది.
ఫీచర్ల పరంగా, కుషాక్ ఓనిక్స్ మోడల్ డీఆర్ఎల్స్ తో ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్స్, కార్నరింగ్ ఫాగ్ ల్యాంప్స్, డీఫాగర్‌తో రియర్ వైపర్, హిల్ హోల్డ్ కంట్రోల్, ప్యాడిల్ షిఫ్టర్స్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ మరియు 6 ఎయిర్‌బ్యాగ్స్ వంటి ఫీచర్లతో వచ్చింది. ఇంకా చెప్పాలంటే, ఓనిక్స్ వేరియంట్ ఫ్లోర్ మ్యాట్స్, స్కఫ్ ప్లేట్స్, ఓనిక్స్ బ్యాడ్జి, మరియు ఓనిక్స్-థీమ్డ్ కుషన్స్ వంటి వాటిని పొందింది.
అక్టోబర్ 2022లో, గ్లోబల్ న్యూ కార్ అసెస్‌మెంట్ ప్రోగ్రామ్ ద్వారా దాని కొత్త ప్రోటోకాల్స్ ప్రకారం కుషాక్‌ను టెస్ట్ చేసింది. అందులో ఈ ఎస్‍యూవీ అడల్ట్ సేఫ్టీలో 34 పాయింట్లకు 29.64 పాయింట్లు మరియు చైల్డ్ సేఫ్టీలో 49 పాయింట్లకు 42 పాయింట్లు స్కోర్ చేసింది. ఇంకో విషయం ఏంటి అంటే, అడల్ట్స్ మరియు చైల్డ్ సేఫ్టీలో 5-స్టార్ రేటింగ్ సాధించిన మొదటి మేడ్-ఇన్-ఇండియా కారుగా కుషాక్ నిలిచింది.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్