- అన్నింటికంటే బేస్ వేరియంట్ పై మరింతగా పెరిగిన ధరలు
- ఇండియాలో రూ.11.89 లక్షలతో ప్రారంభంకానున్న కుషాక్ ధరలు
జనవరి 1వ తేదీ, 2024 నుంచి కంపెనీ ఉత్పత్తి చేస్తున్న అన్ని ప్రొడక్ట్స్ పై ధరలను పెంచుతున్నట్లు చివరి నెలలో స్కోడా కంపెనీ ప్రకటించింది. ప్రకటించిన ధరలు ఇప్పటికే అమలులోకి వచ్చాయి. ఇప్పుడు, ఆటోమేకర్ పెంచిన ధరలను ఈ ఆర్టికల్ ద్వారా మీ ముందుకు తీసుకువస్తున్నాము. వేరియంట్-వారీగా స్కోడా కుషాక్ ఎస్‍యూవీ ఎక్స్-షోరూం ధరలు క్రింద ఇవ్వబడ్డాయి.
వేరియంట్ | పాత ధర | కొత్త ధర | వ్యత్యాసం |
యాక్టివ్ 1.0-లీటర్ | రూ. 10.89 లక్షలు | రూ. 11.89 లక్షలు | రూ. 1,00,000 |
ఓనిక్స్ 1.0-లీటర్ | రూ. 12.39 లక్షలు | రూ. 12.79 లక్షలు | రూ. 40,000 |
యాంబిషన్ 1.0-లీటర్ | రూ. 13.53 లక్షలు | రూ. 14.19 లక్షలు | రూ. 66,000 |
స్టైల్ 1.0-లీటర్(నాన్-సన్‌రూఫ్) | రూ. 15.91 లక్షలు | ధరలో మార్పు లేదు | - |
స్టైల్1.0-లీటర్ | రూ. 16.11 లక్షలు | రూ. 16.59 లక్షలు | రూ. 48,000 |
మ్యాట్ ఎడిషన్ 1.0-లీటర్ | రూ. 16.19 లక్షలు | ధరలో మార్పు లేదు | - |
యాంబిషన్1.5-లీటర్ | రూ. 15.18 లక్షలు | రూ. 15.99 లక్షలు | రూ. 80,000 |
స్టైల్1.5-లీటర్ | రూ. 18.11 లక్షలు | రూ. 18.31 లక్షలు | రూ. 20,000 |
మ్యాట్ ఎడిషన్1.5-లీటర్ | రూ. 18.19 లక్షలు | ధరలో మార్పు లేదు | - |
ఎలిగెన్స్ 1.5-లీటర్ | రూ. 18.31 లక్షలు | ధరలో మార్పు లేదు | - |
యాంబిషన్1.0-లీటర్ ఎటి | రూ. 15.33 లక్షలు | రూ. 15.49 లక్షలు | రూ. 16,000 |
మ్యాట్ 1.0-లీటర్ ఎటి | రూ. 17.79 లక్షలు | ధరలో మార్పు లేదు | - |
స్టైల్1.0-లీటర్ ఎటి | రూ. 17.71 లక్షలు | రూ. 17.89 లక్షలు | రూ. 18,000 |
యాంబిషన్1.5-లీటర్ ఎటి | రూ. 16.98 లక్షలు | రూ. 17.39 లక్షలు | రూ. 41,000 |
స్టైల్1.5-లీటర్ఎటి | రూ. 19.31 లక్షలు | రూ. 19.79 లక్షలు | రూ. 48,000 |
మ్యాట్ 1.5-లీటర్ ఎటి | రూ. 19.39 లక్షలు | ధరలో మార్పు లేదు | - |
ఎలిగెన్స్1.5-లీటర్ ఎటి | రూ. 19.51 లక్షలు | ధరలో మార్పు లేదు | - |
మెకానికల్ గా, స్కోడా కుషాక్ ను 1.0-లీటర్ టిఎస్ఐ పెట్రోల్ మరియు 1.5-లీటర్ టిఎస్ఐ పెట్రోల్ ఇంజిన్ అనే రెండు పవర్ ట్రెయిన్ ఆప్షన్లతో పొందవచ్చు. మొదటిది 114bhp మరియు 178Nm టార్కును ఉత్పత్తి చేస్తుండగా, రెండవది 148bhp మరియు 250Nm మాక్సిమం టార్కును ఉత్పత్తి చేస్తుంది. ఇక ట్రాన్స్‌మిషన్ ఆప్షన్లలో 6-స్పీడ్ మాన్యువల్, ఆటోమేటిక్ టార్క్ కన్వర్టర్, మరియు 7-స్పీడ్ డిసిటి యూనిట్ ఉన్నాయి.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్