- 1.5-లీటర్ టిఎస్ఐ పెట్రోల్ ఇంజిన్ తో లభ్యం
- ప్రత్యేకంగా డీప్ బ్లాక్ ఎక్స్‌టీరియర్ కలర్ తో వచ్చిన కుషాక్ ఎలిగెన్స్
ఇండియాలో స్కోడా కంపెనీ దాని ఎంక్యూబీ మోడల్స్ లోకి కొత్తగా “ఎలిగెన్స్” వేరియంట్స్ ని తీసుకువచ్చింది, అవి ఏవి అంటే, స్లావియా మరియు కుషాక్. స్కోడా కంపెనీ ఈ కొత్త కుషాక్ ఎలిగెన్స్ ఎడిషన్ లోని మాన్యువల్ మరియు ఆటోమేటిక్ వెర్షన్లను రూ.18.31 లక్షలు(ఎక్స్-షోరూం) ప్రారంభ ధరతో అందుబాటులోకి తీసుకువచ్చింది.
బయటి వైపు, ఈ కొత్త కుషాక్ ఎలిగెన్స్ ఎడిషన్ ఆల్-న్యూ డీప్ బ్లాక్ కలర్ ఫినిషింగ్ తో వచ్చింది. ఇంకా ఇతర హైలెట్స్ లో ముఖ్యంగా చెప్పాలంటే డోర్ మరియు గ్రిల్ పై క్రోమ్ గార్నిష్, పిల్లర్స్ పై ఎలిగెన్స్ సింబల్, పడిల్ ల్యాంప్స్, మరియు 17-ఇంచ్ వెగా డ్యూయల్-టోన్ అల్లాయ్ వీల్స్ ఉన్నాయి.
దీని లోపల చూస్తే, క్యాబిన్ విషయానికి వస్తే ఇందులో 10-ఇంచ్ ఇన్ఫోటైన్ మెంట్ సిస్టం, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో మరియు యాపిల్ కార్ ప్లే కనెక్టివిటీ, సబ్ వూఫర్ తో 6-స్పీకర్ సెటప్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, వైర్‌లెస్ ఛార్జర్, క్రూయిజ్ కంట్రోల్, పవర్డ్ ఫ్రంట్ సీట్స్, ఇల్యుమినేటెడ్ ఫుట్‌వెల్ ఏరియా మరియు స్టీరింగ్ వీల్‌పై 'ఎలిగెన్స్' బ్యాడ్జ్ వంటివి ఉన్నాయి.
మెకానికల్ గా, కుషాక్ ఎలిగెన్స్ ఎడిషన్ యొక్క 1.5-లీటర్ టిఎస్ఐ పెట్రోల్ ఇంజిన్ 6-స్పీడ్ మాన్యువల్ మరియు డిఎస్‍జి గేర్ బాక్స్ తో జత చేయబడి ఉంది. దీని మోటార్ 148bhp మరియు 250Nm పీక్ టార్కును ఉత్పత్తి చేసేలా ట్యూన్ చేయబడింది.
కొత్త స్కోడా కుషాక్ ఎలిగాన్స్ ఎడిషన్ ఆన్-రోడ్ ధరలు క్రింద ఇవ్వబడ్డాయి:
కుషాక్ ఎలిగాన్స్ ఎడిషన్ మాన్యువల్ – రూ. 18.31 లక్షలు
కుషాక్ ఎలిగాన్స్ ఎడిషన్ డిఎస్‍జి – రూ. 19.51 లక్షలు
అనువాదించిన వారు: సంజయ్ కుమార్