- ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్స్ తో అందించబడుతున్న మోడల్
- కుషాక్ కొనుగోలుదారులు వెగా అల్లాయ్ వీల్స్‌ను ఎంచుకునే అవకాశం
స్కోడా ఇండియా కుషాక్ మరియు స్లావియా అనే దాని రెండు MQB మోడళ్లలో కొత్త సెట్ యాక్సెసరీలను పరిచయం చేసింది. అలాగే, రూ. 3,200 నుండిరూ. 11,300 మధ్య ధరతోలభించే ఈ యాక్సెసరీలను రెండు మోడల్స్ లోని అన్ని వేరియంట్లలో అమర్చవచ్చు.
కొత్త యాక్సెసరీలలో ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్స్, అండర్ బాడీ లైట్స్ (రూ. 4,700)ధరతో, గ్రిల్‌కు బ్లాక్ గార్నిష్ (రూ. 3,200)ధరతో, మరియు వెగా అల్లాయ్ వీల్స్ బ్లాక్ కలర్ వంటివి ఉన్నాయి. ఈ అన్ని యాక్సెసరీలు ఆయా కార్లలో షేర్ చేయబడినప్పటికీ, కుషాక్ ఎస్‌యువి లో మాత్రమే అల్లాయ్స్ అందించబడుతున్నాయి. రూ.7,700 ధరతో కుషాక్ మరియు రూ. 7,300 ధరతో స్లావియాఫ్రంట్ పార్కింగ్ సెన్సార్‌లను మినహాయించి అన్ని యాక్సెసరీల ధరలు ఈ రెండు మోడళ్లలో సమానంగా ఉన్నాయి.
ఇటీవల, ఆటోమేకర్ కుషాక్ మరియు స్లావియా కొత్త ధరలను అమలులోకి తెచ్చింది. కుషాక్ మరియు స్లావియా సెలెక్ట్ చేసిన వేరియంట్స్ పై వరుసగా రూ.2.19 మరియు రూ. 94,000 లక్షలు వరకు ధరలు తక్కువ అవ్వడంతో, ఇప్పుడు ఇవి మరింత చవకగా లభిస్తున్నాయి. దీనితో, స్లావియాను రూ. 10.69 లక్షలు (ఎక్స్-షోరూమ్)ప్రారంభ ధరతో మరియు కుషాక్ ను రూ. 10.89 లక్షలు ఎక్స్-షోరూమ్ ప్రారంభ ధరతో పొందవచ్చు.
అనువాదించిన వారు: రాజపుష్ప