- 1.0-లీటర్ టిఎస్ఐ పెట్రోల్ ఇంజిన్ తో కూడా లభ్యం
- 7-స్పీడ్ డిఎస్‍జి అనే ఏకైక ట్రాన్స్‌మిషన్ తో అందించబడుతున్న మోడల్స్
ఆటోమేకర్ నుంచి ఇండియా 2.0 సెడాన్ మరియు ఎస్‍యూవీలలో భాగంగా ప్రస్తుతం స్కోడా నుంచి అందించబడిన స్లావియా మరియు కుషాక్ 1.5-లీటర్ ఇంజిన్ వేరియంట్ల నుంచి 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ ని ఆటోమేకర్ తొలగించింది. ఈ ఇంజిన్ 148bhp/250Nm టార్కును ఉత్పత్తి చేస్తుండగా, లేటెస్టుగా అంటే ఇప్పటి వరకు కూడా దీనిని 7-స్పీడ్ డిఎస్‍జి లేదా 6-స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్సుతో పొందవచ్చు. 6-స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్సు 1.0-లీటర్ టిఎస్ఐ పెట్రోల్ ఇంజిన్ తో అందుబాటులో ఉంది. స్లావియా 1.5-లీటర్ రేంజ్ ధరలు రూ.16.69 లక్షల నుంచి ప్రారంభంకాగా, కుషాక్ ధరలు రూ.16.89 లక్షల నుంచి ప్రారంభమయ్యాయి. ఈ రెండూ ధరలు సిగ్నేచర్ వేరియంట్ కి వర్తిస్తాయి.
ప్రముఖంగా, ఇక్కడ సాధ్యమైనవి రెండు ఉన్నాయి. ఈ రెండింటి కారణంగానే, 1.5-లీటర్ టిఎస్ఐ ఇంజిన్ త్రీ-పెడల్ ఆప్షన్ ని నిలిపివేసి ఉండవచ్చు. ధర పరంగా చూస్తే మొదటిది ఏంటి అంటే, కేవలం స్కోడాలో మాత్రమే కాకుండా పూర్తి సెగ్మెంట్లోని హ్యుందాయ్, కియా, ఎంజి, హోండా, మారుతి, మరియు టయోటా నుంచి అందించబడుతున్న వాటిలో ఎక్కువగా ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ని సెలెక్ట్ చేసుకోవడానికి ఇష్టపడుతున్నారు. రెండవది ఏంటి అంటే, స్కోడా నుంచి వస్తున్న కైలాక్ లోని మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్లకు ఎక్కువ డిమాండ్ ఉండే అవకాశం ఉండగా, కాంపాక్ట్ ఎస్‍యూవీకి ఎంతగానో డిమాండ్ ఏర్పడడం ద్వారా ప్రొడక్షన్ కెపాసిటీని తిరిగి కేటాయించవచ్చు.
2030 సంవత్సరంలోపు ఇండియాలో 5 శాతం మార్కెట్ షేర్ ని కలిగి ఉండడానికి, స్కోడా అధిక మొత్తంలో కైలాక్ మోడల్స్ ని తీసుకురానుంది. 2024 కార్ల అప్ గ్రేడ్లలో భాగంగా స్కోడా లేటెస్టుగా దాని కుషాక్ మరియు స్లావియా మోడల్ కార్లలో స్పోర్ట్ లైన్ వెర్షన్ ని తీసుకురాగా, కుషాక్ కారులో మోంటే కార్లో వేరియంట్ ని తీసుకువచ్చింది. స్లావియా మరియు కుషాక్ 1.5-లీటర్ ఇంజిన్ వేరియంట్ల నుంచి 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ ని తొలగించడానికి గల కారణం కోసం మేము ఆటోమేకర్ ని సంప్రదించాము. ఆటోమేకర్ నుంచి కారణానికి తగిన జవాబును అందుకున్నాక మేము మీకు మరోసారి అప్ డేట్ ని అందిస్తాము.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్