- 250 షోరూంలతో ఇండియాలో స్ట్రాంగ్ నెట్ వర్క్
- 2024లోపు ఇండియాలో 350 షోరూంలే లక్ష్యంగా పనిచేస్తున్న స్కోడా
తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో కూడా స్కోడా తమ స్ట్రాంగ్ నెట్ వర్క్ ని కలిగి ఉంది. రానున్న రోజుల్లో హైదరాబాద్, విజయవాడ మరియు తదితర ప్రాంతాల్లో మరిన్ని షోరూంలను ప్రారంభించి మరింతగా తమ నెట్ వర్క్ ని విస్తరించనుంది. దేశవ్యాప్తంగా 250కి పైగా కస్టమర్ షోరూంలను కలిగి ఉన్నట్లు స్కోడా ఇండియా ప్రకటించింది. తాజాగా, తమ సేల్స్ లో భాగంగా కర్ణాటకలోని గుల్బర్గాలో మరో నూతన షోరూంని ప్రారంభించి ఈ ల్యాండ్ మార్కును చేరుకుంది. ముఖ్యంగా, ఈ ఆటోమేకర్ 2024లోపు పాన్ ఇండియా లెవెల్ లో 350 కస్టమర్ షోరూంలే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు తెలిపింది.
మరో వార్తలో, తాజాగా ఈ మానుఫాక్చరర్ స్లావియా మరియు కుషాక్ ఎస్‍యువిలలో తమ ఫీచర్ లిస్టును అప్ డేట్ చేసింది. ఈ రెండు మోడల్స్ లో వైర్ లెస్ ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్ ప్లేకు సపోర్ట్ చేసే కొత్త 10-ఇంచ్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టం, ఇల్యూమినేటెడ్ ఫుట్ వెల్ ఏరియా, బూట్ లో సబ్ వూఫర్, మరియు పవర్డ్ డ్రైవర్ మరియు కో-డ్రైవర్ సీట్స్ వంటి కొత్త ఫీచర్స్ అదనంగా ఉండనున్నాయి.
ల్యాండ్ మార్క్ గురించి స్కోడా ఆటో ఇండియా బ్రాండ్ డైరెక్టర్ పీటర్ సోల్క్ మాట్లాడుతూ “ ఇండియాలో స్కోడాను విస్తరించే స్ట్రాటజీలో భాగంగా మా ప్రోడక్ట్ రేంజ్ ని మెరుగుపరచడమే కాక, కస్టమర్‌లకు మరింతగా అందుబాటులో ఉండేలా చూసుకుంటున్నాం. ఇండియాలో నంబర్స్ పరంగా మా 250వ కస్టమర్ షోరూంని ప్రారంభించి సరికొత్త ల్యాండ్ మార్కును చేరుకున్నాం. మేము మా నెట్‌వర్క్‌ని మరింతగా విస్తరిస్తూ మా కస్టమర్స్ కు ఓనర్ షిప్ ఎక్స్‌పీరియన్స్ మెరుగుపరుస్తాం. ఈ ల్యాండ్ మార్క్ మమ్మల్ని మరింత మంది కస్టమర్స్ ను స్కోడా కుటుంబంలోకి ఆహ్వానించడంతో పాటు, వారికి మార్కెట్లో సేఫ్ కార్లను అందించేలా కృషి చేయడానికి విశ్వాసాన్ని నింపింది” అని తెలిపారు.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్