- మూడు వేరియంట్స్ లో అందుబాటులో ఉన్న కోడియాక్
- పవర్డ్ 2.0-లీటర్, TSI పెట్రోల్ ఇంజన్
స్కోడా ఆటో ఇండియా కోడియాక్ ఎస్యూవీ ధరలను మరోసారి పెంచింది. తక్షణమే పెంచిన ధరలు అమలులోకి రానున్నాయి. సెలెక్టెడ్ వేరియంట్ ని బట్టి మోడల్ ధరపై ఇప్పుడు రూ. రూ. 55,932 వరకు పెరగనుంది.
స్కోడా కొడియాక్ స్టైల్, స్పోర్ట్‌లైన్ మరియు ఎల్&కె అనే మూడు వేరియంట్స్ లో అందుబాటులో ఉంది. బేస్-స్పెసిఫిఫికేషన్ స్టైల్ వేరియంట్ ధరపై రూ. 51,338 పెరిగి, ఇప్పుడు ధర రూ. 38.50 లక్షలు కానుంది. అదేవిధంగా, మిడ్-లెవల్ స్పోర్ట్‌లైన్ వేరియంట్ ధరపై రూ. 53,230 పెరిగి, కొత్త ధర రూ. 39.92 లక్షలుగా ఉండనుంది. అదే విధంగా, టాప్-ఎండ్ ఎల్&కే వేరియంట్ ధరపై రూ. 55,932 పెరిగి, ఇప్పుడు దీని ధర రూ. 41.95 లక్షలు (అన్ని ధరలు, ఎక్స్-షోరూమ్) కానుంది.
త్వరితగతిన డెలివరీ చేసేందుకు వీలుగా భారత మార్కెట్‌కు కొడియాక్ కేటాయింపులను మరింత పెంచినట్లు ఈ ఏడాది జూన్‌లో స్కోడా వెల్లడించింది. ఈ మోడల్ 2.0-లీటర్, TSI పెట్రోల్ ఇంజన్‌తో 187bhp ఉత్పత్తి చేస్తూ, కొత్త-జెన్ మోడల్ గా కనిపించాలని మేజర్ అప్ డేట్ తో మార్కెట్లోకి రావడానికి సిద్ధంగా ఉంది, ఇటీవలి కాలంలో ఈ బ్రాండ్ వీటికి సంబంధించిన టీజర్ పిక్చర్స్ ను కూడా షేర్ చేసింది.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్