- మొదటిసారిగా వెల్లడైన కాంపాక్ట్ ఎస్‍యూవీ ఎక్స్‌టీరియర్ స్కెచ్
- సరికొత్త ఫ్రంట్ డిజైన్ తో రానున్న మోడల్
స్కోడా ఇటీవలే సరికొత్త ఎల్రాక్ కొత్త వివరాలను వెల్లడించింది , ఈ బ్రాండ్ మోడరన్ సాలిడ్ డిజైన్ లో మార్పులను చేసింది. మొదటి ప్రొడక్షన్ మోడల్ గా ఉన్న ఎల్రాక్ ఎక్స్‌టీరియర్ స్కెచ్ డిజైన్ ను మొదటిసారిగామనకు అందిస్తుంది, ఇందులో స్కోడా లెటరింగ్ మరియు బంపర్‌లోకి తో ఇంటిగ్రేట్ చేయబడిన మ్యాట్రిక్స్-ఎల్ఈడీ హెడ్‌లైట్స్ ఉన్నాయి. మరిన్ని విజువల్ హైలైట్‌లలో డార్క్ క్రోమ్ వివరాలు ఉన్నాయి.
ఎక్స్‌టీరియర్ స్కెచ్ ని చూస్తే, ఇది కొత్తగా రూపొందించిన ఫ్రంట్ ఎండ్‌ను పొందుతుంది. సాధారణమైన స్కోడా గ్రిల్ స్థానంలో ఫ్లాట్, అలాగే, కారు రూపం, దీని లుక్ ను మరింత మెరుగుపరిచేందుకు హైలైట్ అంశాలు అని చెప్పవచ్చు. ఇంకా చెప్పాలంటే, ముందు భాగం స్ప్లిట్ హెడ్‌లైట్ డిజైన్‌తో ప్రత్యేకంగా ఉంటుంది, దీనిపై భాగం వరకు సన్నగా విస్తరించి ఉండే బోనెట్ డార్క్ క్రోమ్‌లో స్కోడా లెటరింగ్ ను కలిగి ఉంది, స్కోడా నుంచి కొత్త కార్పొరేట్ గుర్తింపుతో రూపొందించిన మొదటి వెహికల్ ఎల్రాక్ అని చెప్పవచ్చు.
ఎల్రాక్ వెనుక భాగంలో రూఫ్ స్పాయిలర్ మరియు స్లిమ్ ఎల్ఈడీ టెయిల్‌లైట్స్ వంటివి ఉన్నాయి. ఇందులోని అదనపు విజువల్ హైలైట్‌లలో డార్క్ క్రోమ్ యాక్సెంట్ మధ్యలో టెయిల్‌గేట్‌పై “స్కోడా” లెటరింగ్ అందించబడింది. అధికారికంగా, ఎల్రాక్ 4.5 మీటర్ల పొడవు ఉంటుందని స్కోడా గతంలో వెల్లడించింది, ఈ కారు మొత్తం సైజ్ పరంగా చూస్తే , కుషాక్ కంటే పొడవుగా కనిపిస్తూ ఉంది. ఈ మోడల్ ఎంఈబీ(MEB) ప్లాట్‌ఫారమ్‌పై తయారవుతుందని భావిస్తున్నాం. అలాగే, స్కోడా నుంచి ఖరీదైన ఎలక్ట్రిక్ వెర్షన్ ఎన్యాక్ ను పోలి ఉండి, వివిధ కాస్మెటిక్ అప్‌డేట్‌లతో వచ్చే అవకాశం ఉంది.
అనువాదించిన వారు: రాజపుష్ప