- 2025లో లాంచ్ కానున్న కాంపాక్ట్ ఎస్‌యువి
- ఎస్‌యువి పై 10 పేర్లనుషార్ట్‌లిస్ట్ చేసిన స్కోడా
ఇండియాలో స్కోడా నుంచి వస్తున్న సరికొత్త ప్రొడక్టు మరోసారి టెస్టింగ్ చేయబడింది., అయితే ఈసారి కారు భారీగా కామోఫ్లేజ్ తో కప్పబడి ఉండగా, తద్వారా కారు మొత్తం రూపురేఖలు మరియు వైఖరి గురించి మనం ఒక ఐడియాకు రావచ్చు.
స్పై షాట్‌లలో చూస్తే, ఇది కుషాక్ నుండి చాలా డిజైన్ సూచనలను పొందింది అని వెల్లడవుతుంది, ఇక లుక్ విషయానికి వచ్చినప్పడు ఫోక్స్‌వ్యాగన్ గ్రూప్ మార్గదర్శకులలో ఒకటిగా ఇది పరిగణించబడుతుంది. చిత్రాలలో, హెడ్‌ల్యాంప్స్ ఉన్న స్థానం మరియు దాని అల్లాయ్ వీల్స్‌లో ఒకదాని డిజైన్‌ను కూడా పొందవచ్చని తెలుస్తుంది.
చాలా వరకు క్యాబిన్ మరియు ఫీచర్స్ కుషాక్ మరియు స్లావియా నుండి వస్తాయని కూడా మాకు ఇప్పటికే తెలిసింది, అయితే ఈ రెండు కార్లను వేరుగా చూపడం లో మరియు మొత్తం ఫీచర్స్ పరంగా స్పష్టమైన విభజనకు ఇది సహాయపడుతుంది. దీని సెగ్మెంట్‌లోని చాలా వరకు కార్ల లాగే ఈ కారు 2.6 మీటర్ల వీల్‌బేస్‌తో 3.99 మీటర్ల పొడవు ఉంటుంది. అలాగే, ఇది 1.0-లీటర్ టిఎస్ఐ పెట్రోల్‌తో అందించబడనుండగా , ఇది 115bhp/175Nm టార్కును ఉత్పత్తి చేస్తుంది. దీనిని 6-స్పీడ్ ఎంటి లేదా 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ తో పొందవచ్చు.
కాంపాక్ట్ ఎస్‌యువి మారుతి బ్రెజా, మారుతి ఫ్రాంక్స్, రెనాల్ట్ కైగర్, నిస్సాన్ మాగ్నైట్, కియా సోనెట్, మహీంద్రా XUV 3XO మరియు హ్యుందాయ్ వెన్యూ వంటి వాటితో పోటీ పడనుంది.
మూలం
అనువాదించిన వారు: రాజపుష్ప