- ఇండియా 2.0 ప్రోగ్రాం ద్వారా వస్తున్న మూడవ ఎలక్ట్రిక్ కారు
- 1.0-లీటర్ టిఎస్ఐ పెట్రోల్ ఇంజిన్ ని పొందనున్న కొత్త కాంపాక్ట్ ఎస్‍యూవీ
ఈ సంవత్సరం ప్రారంభంలో, స్కోడా కంపెనీ ఇండియా 2.0 ప్రోగ్రాంని ప్రారంభించగా, ఆ ప్రోగ్రాం కింద 2025 ప్రారంభంలో దాని మూడవ ఎలక్ట్రిక్ కారును తీసుకువస్తున్నట్లు ప్రకటించింది. సబ్- ఫోర్ కాంపాక్ట్ ఎస్‍యూవీని స్కోడా తీసుకువస్తుండగా, 2024 ఆగస్టు 21వ తేదీన దీని పేరును అధికారికంగా వెల్లడించనుంది.
స్కోడా కంపెనీ దాని అన్ని ఇతర ఎస్‍యూవీ పేర్లను ‘K’ అనే లెటర్ తో ప్రారంభించగా, అందులో కుషాక్ మరియు కొడియాక్ వంటి కార్లు ఉన్నాయి. ఇందులో 1.0-లీటర్ టిఎస్ఐ పెట్రోల్ ఇంజిన్ ని ఆటోమేకర్ అందించనుండగా, ఈ ఇంజిన్ 114bhp పవర్ మరియు175Nm టార్కును ఉత్పత్తి చేస్తుంది. అదే విధంగా ఇందులోని ఇంజిన్ 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ మరియు 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ వంటి పవర్ ట్రెయిన్లతో జతచేయబడి రానుంది.
దీని డిజైన్ లాంగ్వేజీలో అందించిన ఒకే విధమైన ఫ్రంట్ ప్రొఫైల్, వీల్స్ డిజైన్, మరియు టెయిల్ ల్యాంప్స్ వంటి వాటిని చూస్తే స్కోడా కుషాక్ మోడల్ లాగా కనిపిస్తుంది. ఈ కారు డ్యూయల్ డిజిటల్ స్క్రీన్స్, క్లైమేట్ కంట్రోల్, కనెక్టెడ్ కార్ టెక్నాలజీ, మరియు 360-డిగ్రీ కెమెరా వంటి ఫీచర్ లిస్టుతో వచ్చే అవకాశం ఉంది. నంబర్స్ పరంగా ఈ కారు స్కోడా కంపెనీకి అతి ముఖ్యమైన కారు కానుండగా, ఇది మారుతి బ్రెజా, కియా సోనెట్, హ్యుందాయ్ వెన్యూ, మహీంద్రా XUV 3XO, మారుతి ఫ్రాంక్స్, మరియు టయోటా టైజర్ వంటి కార్లతో పోటీని ఎదుర్కొంటుంది.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్