- 1.0-లీటర్ ఇంజిన్ సర్టిఫికేషన్ ని పొందిన స్కోడా
- 2024 నాల్గవ త్రైమాసికం నాటికి సర్టిఫైడ్ 1.5-లీటర్ ఇంజిన్ ని పొందనున్న స్కోడా కార్లు
మొట్ట మొదటి సారిగా E20-కంప్లైంట్ ఇంజిన్లపై అధికారిక సర్టిఫికేషన్ ని పొందిన కొన్ని బ్రాండ్‌లలో స్కోడా ఇండియా ఒకటి అని చెప్పవచ్చు.ఆటోమోటివ్ రీసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఏఆర్ఏఐ) 1.0-లీటర్ ఇంజిన్ స్కోడా కార్లకు E20 ఫ్యూయల్-కంప్లైంట్ సర్టిఫికేట్‌ను మంజూరు చేసింది. ఇంతలో మరో వైపు, 1.5-లీటర్ టిఎస్ఐ ఇంజిన్‌లు అతి త్వరలో 2024 నాల్గవ త్రైమాసికం నాటికి సర్టిఫికేషన్ ను అందుకోనున్నాయి.
ప్రస్తుతం, 1.0-లీటర్ టిఎస్ఐ టర్బో-పెట్రోల్ ఇంజిన్ కుషాక్ మరియు స్లావియా మోడల్స్ లో మాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో అందించబడుతోంది. ఈ మోటారు E20 ఫ్యూయల్-కంప్లైంట్ కాగా, ఇందులో 20 శాతం ఇథనాల్ మరియు 80 శాతం పెట్రోల్ మిశ్రమం ఉంటుంది.
ముఖ్యంగా, ఇండియన్ గవర్నమెంట్ ఏప్రిల్ 2025 నుండి అన్ని వెహికల్స్ లో E20-కంప్లైంట్‌ని తప్పనిసరి చేసింది. ఇప్పుడు, ఫోక్స్‌వ్యాగన్ వర్టూస్ మరియు టైగున్ కూడా ఒకే ఇంజిన్‌ను షేర్ చేసుకుంటుండగా, ఈ మోడళ్లు కూడా త్వరలో అధికారిక సర్టిఫికేషన్ ను పొందుతాయని సహజంగా చెప్పవచ్చు.
అనువాదించిన వారు: రాజపుష్ప