- 31 డిసెంబర్ వరకు మాత్రమే అందుబాటులో ఉండనున్న ఆఫర్స్
- తాజాగా లాంచ్ అయిన స్లావియా మరియు కుషాక్ ఎలిగెన్స్ ఎడిషన్స్
డిసెంబర్ 2023లో స్కోడా కారును కొనుగోలు చేయాలనుకున్న వారికి ఇప్పుడు మేము చెప్పబోయేది ఒక గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు. ఎందుకంటే, ఈ ఆటోమేకర్ తన పోర్ట్ ఫోలియోలో ఉన్న అన్నీ మోడల్స్ పై రూ.1.5 లక్షల వరకు భారీ డిస్కౌంట్స్ అందిస్తుంది. కానీ, ఈ ఆఫర్లు మనం ఎంచుకునే ప్రాంతం, మోడల్, వేరియంట్, కలర్, డీలర్ షిప్ మరియు ఇతర అంశాలను బట్టి కేవలం 31 డిసెంబర్ 2023 వరకు మాత్రమే అందుబాటులో ఉండనున్నాయి.
ప్రస్తుతం, స్కోడా ఫ్యామిలీ నుంచి వచ్చిన స్లావియా మరియు కుషాక్ లపై కంపెనీ రూ.1.5 లక్షల వరకు భారీ డిస్కౌంట్స్ అందిస్తుంది. ఇందులో కార్పొరేట్ డిస్కౌంట్ రూ. 25,000, ఎక్స్ఛేంజ్ బోనస్ రూ. 40,000, మరియు 4 సంవత్సరాల పాటు లేదా 60,000 కి.మీ. వరకు రూ. 85,000 వరకు కాంప్లిమెంటరీ మెయింటెనెన్స్ ఉన్నాయి. మరొక మోడల్ అయిన కొడియాక్ ఎస్యూవీపై రూ.1.25 లక్షల వరకు డిస్కౌంట్స్ లభించనున్నాయి. ఇందులో రూ. 40,000 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్, కార్పొరేట్ డిస్కౌంట్ రూ. 30,000, మరియు రూ. 55,000 విలువ చేసే 4 సంవత్సరాల సర్వీస్ ప్యాకేజీ ఉన్నాయి.
మరొక వార్తలో చూస్తే, తాజాగా ఈ బ్రాండ్ ఇండియాలో స్లావియా మరియు కుషాక్ ఎలిగెన్స్ ఎడిషన్లనువరుసగా రూ.17.52 లక్షలు (ఎక్స్-షోరూం)మరియు రూ.18.31 లక్షలు (ఎక్స్-షోరూం) ప్రారంభ ధరలతో లాంచ్ చేసింది. టాప్-స్పెక్ స్టైల్ వేరియంట్ ఎడిషన్ ఇంటీరియర్లో కొన్ని కాస్మెటిక్ అప్గ్రేడ్స్ తో పాటుగా సరికొత్త డీప్ బ్లాక్ ఎక్స్టీరియర్ కలర్ తో అందుబాటులో ఉంది. మరి ఇంకెందుకు ఆలస్యం, ఇప్పుడే మీకు నచ్చిన స్కోడా కారును భారీ డిస్కౌంట్స్ తో కొనుగోలు చేయండి.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్