- అక్టోబర్ 8వ తేదీన ఇండియాలో లాంచ్
- రెండు రేంజ్ ఆప్షన్లతో లభిస్తున్న eMax7 కారు
బివైడి ఇండియా లేటెస్టుగా eMax7 అనే ఎలక్ట్రిక్ ఎంపివి లాంచ్ చేయగా, ఈ 7-సీటర్ ఎంపివికి అత్యధిక డిమాండ్ కొనసాగుతున్నట్లు బివైడి ఇండియా వెల్లడించింది. eMax7లోని 6-సీటర్ కంటే రూ.60 వేల ఎక్కువ ధరతో 7-సీటర్ వెర్షన్ అందుబాటులో ఉండగా, డ్రైవింగ్ రేంజ్ మరియు ఫీచర్ల పరంగా ఈ రెండు వెర్షన్లు ఒకే రకమైన అంశాలను కలిగి ఉన్నాయి.
అంతే కాకుండా, ఈ కారులోని టాప్-స్పెక్ సుపీరియర్ వేరియంట్ కూడా అత్యధిక డిమాండ్ ని కలిగి ఉన్నట్లు బివైడి పేర్కొనగా, అక్టోబర్ 8వ తేదీన లాంచ్ కాగా అయినప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ ఎంపివి 1000 బుకింగ్స్ ని పొందింది. e6 మోడల్ తో పోలిస్తే వీటి సంఖ్య గణనీయంగా పెరిగింది. దాని పీరియడ్ లో 1600 యూనిట్ల e6 మోడల్స్ విక్రయించబడ్డాయి. ఇక్కడ మనం గమనించాల్సిన అంశం ఏమిటంటే ? e6 మోడల్ కరోనా నేపథ్యంలో వివిధ లాక్ డౌన్స్ తర్వాత వచ్చింది. అప్పుడే ఎకానమీ కూడా ప్రారంభించబడింది. దీని ద్వారా మొదటిసారిగా ప్రైవేట్ మార్కెట్ సెగ్మెంట్లో బివైడి అడుగుపెట్టింది. చివరగా, ఆటోమేకర్ దీంతో పాటుగా సుపీరియర్ వేరియంట్ ని కూడా వెల్లడించగా, ఇందులోని వైట్ మరియు సిల్వర్ కలర్లకు అత్యధిక డిమాండ్ కొనసాగుతుంది.
e6 ఎంపివి మోడల్ కి రీప్లేస్ మెంట్ గా చైనీస్ ఆటోమేకర్ బివైడి eMax7ని తీసుకువస్తుండగా, మీరు ఎంచుకునే వేరియంట్ ని బట్టి మరియు బ్యాటరీ ప్యాక్ ని బట్టి రెండు డ్రైవింగ్ రేంజ్ ఆప్షన్లలో 420 కిలోమీటర్లు మరియు 530 కిలోమీటర్ల డ్రైవింగ్ రేంజ్ ని అందిస్తుంది. e6 మోడల్ తో పోలిస్తే ఈ మోడల్ అత్యధిక ఫీచర్లతో మన ముందుకు వచ్చింది. అందులో 12.3-ఇంచ్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్ మెంట్ సిస్టం, వైర్ లెస్ ఫోన్ మిర్రరింగ్, ఎయిర్ ప్యూరిఫైయర్, పనోరమిక్ సన్ రూఫ్, పవర్డ్ టెయిల్ గేట్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, మరియు లెవెల్-2 ఎడాస్ (ఏడీఏఎస్) వంటి ఫీచర్లు ఉన్నాయి.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్