- రానున్న రెండేళ్లలో ఇండియాలో అసెంబుల్ చేయబడనున్న విన్ ఫాస్ట్ కార్లు
- హ్యుందాయ్ క్రెటా/కియా సెల్టోస్ మోడల్స్ లాగే ఒకే సైజును కలిగి ఉన్న VF e34
ఇండియాలో టెస్టింగ్
కొన్ని నెలల తర్వాత భారీ ఎత్తున తమిళనాడులో కొత్త విన్ ఫాస్ట్ బ్రాండ్ కొత్త ప్లాంటును స్థాపించనుండగా, దాని కంటే ముందు విన్ ఫాస్ట్ బ్రాండ్ కార్లు ఇండియాలో టెస్టింగ్ చేయడం ప్రారంభించాయి. VF e34 మిడ్-సైజ్ ఎస్‍యూవీ ఇండియాలో టెస్టింగ్ చేస్తుండగా మేము ఈ మోడల్ ఫోటోలను తీశాము, ఇక్కడ మీకు వాటిని ఎక్స్‌క్లూజివ్ గా అందిస్తున్నాము.
పవర్ ట్రెయిన్ మరియు సైజు
ప్రస్తుతం వియత్నాం మరియు ఇండోనేషియాలో VF e34 మోడల్ సేల్స్ జరుగుతుండగా, ఆటోమేకర్ నుంచి దాని రేంజ్ లో వచ్చిన అతి చిన్న కారు ఇదే. అలాగే, ఇది 110kW బ్యాటరీ ప్యాక్ తో 318 కిలోమీటర్ల క్లెయిమ్డ్ రేంజ్ ని అందిస్తుంది. ప్రస్తుతం అందించబడుతున్న ఈవీ మోడల్స్ తో పోలిస్తే ఈ మోడల్ అత్యధిక బ్యాటరీ ప్యాక్ ని కలిగి ఉంది. అదే విధంగా ఈ మోడల్ కేవలం 9 సెకన్లలో 0-100కెఎంపిహెచ్ వేగాన్ని అందుకుంటుంది. ఇంకా అతి ముఖ్యమైన విషయం, కొలతల విషయానికి వస్తే, ఈ కారు 4.3 మీటర్ల పొడవు ఉండగా, 2.6 మీటర్ల వీల్ బేస్ ని కలిగి ఉంది. అలాగే ఇది దాని సైజును బట్టి కియా సెల్టోస్, హ్యుందాయ్ క్రెటా, మారుతి గ్రాండ్ విటారా, టయోటా అర్బన్ క్రూజర్ హైరైడర్, హోండా ఎలివేట్ మరియు ఎంజి ఆస్టర్ వంటి మోడల్స్ తో పోటీ పడనుంది.
క్యాబిన్ మరియు ఫీచర్ లిస్టు
ఇక క్యాబిన్ విషయానికి వస్తే, క్రోమ్ ఇన్సర్ట్స్ తో ఆల్-గ్రే కలర్ తో రాగా ఒక వర్టికల్ యూనిట్ మరియు మరొకటి భారీ సైజుతో డ్యూయల్-డిజిటల్ డిస్ ప్లేలను కలిగి ఉంది. దీని ఫీచర్ల గురించి చెప్పాలంటే, ఆధునాతమైన ఫీచర్లతో రానుండగా, అందులో లెవెల్-2 ఎడాస్ (ఏడీఏఎస్), క్లైమేట్ కంట్రోల్, డ్యూయల్ యూఎస్‍బీ ఛార్జింగ్ పోర్ట్స్, హైలైన్ టిపిఎంఎస్, కనెక్టెడ్ కార్ టెక్నాలజీ, మరియు 360-డిగ్రీ కెమెరా వంటి ఫీచర్లు ఉన్నాయి. మొత్తంగా చూసినప్పుడు, ఫీచర్ లిస్టు ద్వారా ఇది దానితో పోటీపడే ఏ కారుతో కూడా తీసిపోని విధంగా బెస్ట్ ఫీచర్లతో వచ్చే అవకాశం ఉంది.
ధర మరియు పోటీ
ఇండియాలో మొదటిసారిగా VF e34 మోడల్ ని మనం చూస్తుండగా, ఇప్పుడు విన్ ఫాస్ట్ లైనప్ లో భాగంగా ఇది ఇక్కడికి రానుంది. ఇంకా ధర విషయానికి వస్తే, విన్ ఫాస్ట్VF e34 మోడల్ ధర రూ. 20 లక్షలనుంచి రూ. 25 లక్షల మధ్య ఉండే అవకాశం ఉందని మేము భావిస్తున్నాము. అలాగే, ఇది ఎంజి ZS ఈవీ, మారుతి eVX, కియా కారెన్స్ ఈవీ, మహీంద్రా XUV.e8, హోండా ఎలివేట్ ఈవీ, మరియు టయోటా అర్బన్ స్పోర్ట్ కాన్సెప్ట్ ప్రొడక్షన్ వెర్షన్ తో పోటీ పడే అవకాశం ఉంది.
అనువాదించిన వారు : సంజయ్ కుమార్