- ఆగస్టు 7న కర్వ్ ఈవీలాంచ్ తర్వాత రానున్న ఐసీఈ వెర్షన్
- 1.2-లీటర్ టర్బో పెట్రోల్ మరియు 1.5-లీటర్ డీజిల్ ఇంజిన్లను పొందనున్న టాటా కర్వ్
లేటెస్టుగా, టాటా కర్వ్ మరియు ఐసీఈ వెర్షన్లకు సంబంధించి అందరి కంటే ముందుగా వీటి రియల్ వరల్డ్ ఫోటోలను మేము కలిగి ఉన్నాము. అదే విధంగా, ఈ కూపే ఎస్‍యూవీ కారులో అందించబడే టెక్ మరియు ఫీచర్ల ఎక్స్‌క్లూజివ్ వివరాలను కలిగి ఉన్నాము. మొదటగా, కర్వ్ ఈవీ ఆగస్టు 7న లాంచ్ కాబోతుండగా, దాని తర్వాత కర్వ్ ఐసీఈ వెర్షన్ సెప్టెంబరు మొదటి వారంలో లాంచ్ కానుంది.
ఇంటీరియర్ హైలైట్స్
కర్వ్ మోడల్ దాని టాప్-స్పెక్ వెర్షన్లలో లెదరెట్ అప్హోల్స్టరీ మరియు లెదర్ తో చుట్టబడిన స్టీరింగ్ వీల్ ని పొందనుంది. అదనంగా, ఇది ఏటీ వెర్షన్లలో టాటా స్మార్ట్ డిజిటల్ షిఫ్టర్ ని పొందనుండగా, మాన్యువల్ మోడల్స్కన్వెన్షనల్ గేర్ లీవర్ తో అమర్చబడి రానున్నాయి. అనుకున్న విధంగానే, ఇది ఆటోమేకర్ నుంచి లేటెస్టుగా అందించబడిన ఇల్యూమినినేటెడ్ లోగోతో కూడిన టూ-స్పోక్ స్టీరింగ్ వీల్ ని పొందుతుంది. అలాగే ఈ కారు పనోరమిక్ సన్ రూఫ్, పొందుతుండగా, ఇది మూడ్ లైటింగ్ మరియు వివిధ భాషల్లో వాయిస్ అసిస్టెన్స్ తో అందించబడనుంది. 60:40 నిష్పత్తిలో రియర్ స్ప్లిట్ సీట్లతో రానుండగా, మాకు అందిన సమాచారం ప్రకారం, ఇది పవర్ టెయిల్ గేట్ తోఅందుబాటులోకి రానుంది.
టెక్నాలజీ హైలైట్స్
ఇందులో అందించబడే అతిపెద్ద టెక్నాలజీ హైలైట్ ఏంటి అంటే, కర్వ్ మోడల్ 12.3-ఇంచ్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టం మరియు 10.25-ఇంచ్ ఇంస్ట్రుమెంట్ క్లస్టర్ తో రానుంది. హారియర్ మరియు సఫారీ కార్లలో కూడా వీటిని మనం చూడవచ్చు. హారియర్ వైర్ లెస్ ఫోన్ మిర్రరింగ్, 360-డిగ్రీ కెమెరా మరియు 8-స్పీకర్ సౌండ్ సిస్టంని పొందింది. మాకు తెలిసింది ఏంటి అంటే, ప్యాకేజీలో భాగంగా కర్వ్ మోడల్ యాంబియంట్ లైటింగ్ మరియు బ్లైండ్ స్పాట్ మానిటర్ తో లెవెల్-2 ఎడాస్ (ఏడీఏఎస్) ని పొందుతుంది.
పవర్ ట్రెయిన్ ఆప్షన్స్
ఇండియన్ ఆటోమేకర్ నుంచి వచ్చిన టాటా కర్వ్ 123bhp మరియు 225Nmటార్కును ఉత్పత్తి చేసే కొత్త 1.2-లీటర్ జిడిఐ-టర్బో పెట్రోల్ ఇంజిన్ తో అరంగేట్రం చేయనుంది. ఆటోమేకర్ నుంచి వస్తున్న ఈ ఇంజిన్ 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ లేదా 7-స్పీడ్ డిసిటితో అందించబడవచ్చు. కర్వ్ మోడల్ 113bhp మరియు 260Nm టార్కుతో ఉత్పత్తి చేసే డీజిల్ ఇంజిన్ తో వస్తున్నట్లు ఈ సంవత్సరం ప్రారంభంలోనే నిర్ధారించబడింది. ఇందులో 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ ని అందిస్తున్నట్లు నిర్దారించబడగా, 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ తో కూడా అందించవచ్చని మేము భావిస్తున్నాము.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్