- ఆగస్టు 7వ తేదీన కర్వ్ ఈవీ వెర్షన్ లాంచ్
- 5-స్టార్ రేటింగ్ సాధించిన టాటా మూడవ ఎలక్ట్రిక్ మోడల్
టాటా కర్వ్ మరియు కర్వ్ ఈవీ లాంచ్ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్న తరుణంలో, దీనికి మరెంతో దూరంలో లేము. వీటి లాంచ్ కి ఇంకా రెండు వారాలు మాత్రమే మిగిలి ఉంది. ఎందుకంటే కర్వ్ ఈవీ ఆగస్టు 7వ తేదీన లాంచ్ కానుంది. ఇలాంటి సమయంలో ఈ కూపే ఎస్‍యూవీలకు సంబంధించి మరిన్నిఎక్స్‌క్లూజివ్ వార్తలను మీ ముందుకు తీసుకువస్తున్నాము. ఈసారి ఏంటి అంటే, కర్వ్ మోడల్ లోని ఈ రెండు ఇటరేషన్ల క్రాష్ టెస్ట్ వివరాలను పొంది ఉన్నాము. ఈ రెండు కార్లపై జిఎన్ క్యాప్ మరియు బిఎన్ క్యాప్ ద్వారా క్రాష్ టెస్ట్ నిర్వహించబడింది.
మాకు అందిన సమాచారం ప్రకారం, టాటా కర్వ్ లోని ఈవీ వెర్షన్ మరియు ఐసీఈ వెర్షన్ కార్లు జిఎన్ క్యాప్ మరియు బిఎన్ క్యాప్ టెస్టులలో 5-స్టార్ రేటింగ్ ని స్కోర్ చేశాయి. దీంతో, రాబోయే (అప్ కమింగ్) ఎస్‍యూవీలు అత్యధిక రేటింగ్ సాధించడం ద్వారాసఫారీ, హారియర్, నెక్సాన్, నెక్సాన్ ఈవీ, మరియు పంచ్ ఈవీ సరసన చేరాయి.
సేఫ్టీ స్టాండర్డ్స్ పరంగా, టాటా కంపెనీ లేటెస్టు రికార్డులను పరిశీలిస్తే అన్నింటికంటే ఎక్కువ సేఫ్టీ ఫీచర్లతో వస్తుందని మేము భావిస్తున్నాం. సేఫ్టీ సూట్ లో భాగంగా, కర్వ్ మోడల్ 6 ఎయిర్ బ్యాగ్స్, ఈబీడీతో ఏబీఎస్, ఆటో హోల్డ్ తో ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, మొత్తం నాలుగు డిస్క్ బ్రేక్స్, ప్యాసింజర్లు అందరికీ రిమైండర్ తో త్రీ-పాయింట్ సీట్ బెల్ట్స్, ట్రాక్షన్ కంట్రోల్, బ్లైండ్ స్పాట్ మానిటర్ తో 360-డిగ్రీ కెమెరా, మరియు లెవెల్-2 ఎడాస్ టెక్ వంటి ఫీచర్లు ఉండనున్నాయి.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్