- రెండు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్స్ తో అందించబడనున్న కర్వ్ ఈవీ
- ఇండియాలో ఆగస్టు 7న వెల్లడి కానున్న ధరలు
అప్ కమింగ్ (రాబోయే) టాటా కర్వ్ ఈవీ 7 వ తేదీ ఆగస్టు 2024న లాంచ్ కానుండగా, దీనికి సంబంధించిన లెటెస్ట్ వివరాలు వెలువడుతూనేన్నాయి. కర్వ్ ఈవీ లాంచ్ తర్వాత వచ్చే నెలాఖరులో ఐసీఈ డెరివేటివ్ ధర ప్రకటన ఉండనుంది.
క్రింది హుడ్ లో, కర్వ్ ఈవీ రెండు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్స్ తో రానుండగా , కస్టమర్లు రెండు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్స్ నుండి దీనిని ఎంచుకోవచ్చు. టాప్-స్పెక్ వెర్షన్ 55kWh యూనిట్ ఒకే ఎలక్ట్రిక్ మోటార్‌తో జత చేయబడుతుంది. మా రిపోర్ట్స్ ప్రకారం, ఈ ఇటరేషన్ ఒక్కసారి పూర్తి ఛార్జ్‌పై 600కిలోమీటర్ల క్లెయిమ్ చేసిన రేంజ్ ని అందిస్తుంది. ముఖ్యంగా, ఇందులోనిడిసి ఫాస్ట్ ఛార్జింగ్ ఆప్షన్ కూపే ఎస్‌యువి కేవలం 10 నిమిషాల్లో 100కిలోమీటర్ల రేంజ్ ని పొందేందుకు అనుమతిస్తుంది.
ఫీచర్ల పరంగా చెప్పాలంటే, టాటా కర్వ్ ఈవీలో పనోరమిక్ సన్‌రూఫ్, లెవల్ 2 ఏడీఏఎస్(ఎడాస్) సూట్, 360-డిగ్రీ కెమెరా, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్స్ తో పాటు మరిన్ని ఫీచర్లు ఉంటాయి. అలాగే , ఈ అప్‌డేట్‌ల కోసం మా వెబ్‌సైట్‌లో ఉన్న మరిన్ని వివరాలను అన్నింటినీ చదువుకోవచ్చు.
ఇది రూ.18లక్షలు నుండి 24 లక్షలు (ఎక్స్-షోరూమ్)ప్రారంభ ధరతో లాంచ్ అవుతుందని అంచనా. కొత్త కర్వ్ ఈవీ బివైడి అట్టో 3, ఎంజి ZS ఈవీ, మహీంద్రా XUV400 మరియు హ్యుందాయ్ క్రెటా ఈవీ మరియు హోండా ఎలివేట్ ఈవీ వంటి అప్ కమింగ్ (రాబోయే) మోడల్స్ తో పోటీపడనుంది.
అనువాదించిన వారు: రాజపుష్ప