- కొత్తగా వర్చువల్ సన్ రైజ్ కలర్ తో వస్తున్న టాటా కర్వ్ ఈవీ
- రేపే ధరల ప్రకటన
సుమారుగా నెలా, రెండు నెలల నుంచి దేశమంతటా చక్కర్లు కొడుతున్న వార్త ఏదైనా ఉంది అంటే, అది టాటా కర్వ్ కారు అని చెప్పవచ్చు. ఎందుకంటే, టాటా కంపెనీ కర్వ్ ఈవీ మరియు ఐసీఈ వెర్షన్లను సంబంధించిన లేటెస్ట్ వివరాలను అప్ డేట్ చేస్తూనే ఉంది. ఇండియా అంతటా ఎంతగానో ఎదురుచూస్తున్న కర్వ్ కారు లాంచ్ ఎంతో దూరం లేదు. కర్వ్ మోడల్ ని 2024 ఆగస్టు 7వ తేదీన టాటా లాంచ్ చేయనుంది. అదే విధంగా, కర్వ్ ఈవీ వెర్షన్ తో పాటుగా కర్వ్ ఐసీఈ వెర్షన్ కూడా లాంచ్ కాబోతుంది. ఈ రెండు మోడల్స్ కి సంబంధించిన సమాచారాన్ని మా వెబ్ సైట్ ద్వారా మీకు చేరవేస్తున్నాం. అయితే, ఈ మోడల్స్ రేపు లాంచ్ కానుండగా, కర్వ్ ఎలక్ట్రిక్ వెర్షన్ కారు ఎక్స్‌టీరియర్ కలర్ల వివరాలు లీకయ్యాయి. దీని ద్వారా కర్వ్ ఈవీ ఏయే కలర్లలో వస్తుందో ముందే తెలిసిపోయింది.
మాకు అందిన సమాచారం ప్రకారం, టాటా కర్వ్ ఎలక్ట్రిక్ వెర్షన్ మొత్తం ఐదు కలర్లలో అందించబడనుండగా, అందులో ప్రిస్టిన్ వైట్, ఫ్లేమ్ రెడ్, ఎంపవర్డ్ ఆక్సైడ్, ప్యూర్ గ్రే, మరియు వర్చువల్ సన్ రైజ్ వంటి కలర్లు ఉన్నాయి. మొదటి నాలుగు కలర్లు పంచ్ ఈవీ మరియు నెక్సాన్ ఈవీలో అందుబాటులో ఉండగా, వర్చువల్ సన్ రైజ్ కలర్ మాత్రం ఇప్పుడు కొత్తగా కర్వ్ ఈవీ ద్వారా పరిచయం కానుంది.
ఇంకా కర్వ్ ఎలక్ట్రిక్ కారులోని బ్యాటరీ ప్యాక్ మరియు రేంజ్ విషయానికి వస్తే, ఇది రెండు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లతో అందించబడుతుంది. అవి ఏంటి అంటే, మిడ్ రేంజ్ మరియు లాంగ్ రేంజ్ వెర్షన్లు. ఇందులో ఒకటి 55kWh బ్యాటరీ ప్యాక్ తో రానుండగా, ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 600 కిలోమీటర్ల డ్రైవింగ్ రేంజ్ ని అందిస్తుంది. ఇంకా చెప్పాలంటే, డిసి ఫాస్ట్ ఛార్జింగ్ సహాయంతో కర్వ్ ఎలక్ట్రిక్ కారును కేవలం 10 నిమిషాలు ఛార్జింగ్ చేస్తే చాలు, 100 కిలోమీటర్ల డ్రైవింగ్ రేంజ్ అందిస్తుంది.
లాంచ్ అయిన తర్వాత, టాటా కర్వ్ ఎలక్ట్రిక్ కారు ఎలక్ట్రిక్ కార్ల సెగ్మెంట్లో మహీంద్రా XUV400, ఎంజి ZS ఈవీ, బివైడి అట్టో 3, మరియు అప్ కమింగ్ (రాబోయే) హ్యుందాయ్ క్రెటా కార్లతో పోటీపడుతుంది.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్