- స్టాండర్డ్ వెర్షన్ తో పోలిస్తే కాస్మెటిక్ అప్‌డేట్లతో రానున్న ధోని ఎడిషన్
- మెకానికల్ గా ఎలాంటి మార్పులు లేకుండా రానున్న పవర్ ట్రెయిన్
సిట్రోన్ ఇండియా అనే కార్ల సంస్థ ఇండియాలో ఎంఎస్ ధోనికి ఉన్న పాపులారిటీని గుర్తించి, తాము ఉత్పత్తి చేసే ప్రొడక్ట్స్ కి కొత్త బ్రాండ్ అంబాసిడర్‌గా నియమిస్తున్నట్లు ప్రకటించింది. ఈ ప్రకటన రిలీజ్ అయిన కొద్దిరోజుల తర్వాత, ఫ్రెంచ్ కార్ మేకర్ ఇండియాలో C3 ఎయిర్‌క్రాస్ లో 'ధోనీ ఎడిషన్' అనే స్పెషల్ ఎడిషన్ ని తీసుకువస్తున్నట్లు వెల్లడించింది.
ఈ కొత్త స్పెషల్ ఎడిషన్లో అతిపెద్ద హైలైట్స్ ఏంటి అంటే, ఇది రియర్ డోర్ ప్యానెల్స్ పై క్రికెటర్ ఎంఎస్ ధోని లక్కీ నెంబర్ గా మరియు ధోని జెర్సీ నెంబర్ గా ఉన్న '7' ని కొత్త స్ట్రిప్డ్-డిజైన్ గా మరియు 'ధోనీ ఎడిషన్' గ్రాఫిక్స్ ని ఫ్రంట్ డోర్స్ పై తీసుకువచ్చింది. అంతేకాకుండా, ఈ ధోని ఎడిషన్ C3 ఎయిర్‌క్రాస్‌ను బుక్ చేసుకునే కస్టమర్లు ఎంఎస్ ధోని సహకారంతో యాక్సెసరీలను గెలుచుకునే అవకాశాన్ని పొందుతారు.
ఇంకా ఈ స్పెషల్ ఎడిషన్ గురించి చెప్పాలంటే, ఇది ఇల్యూమినేటెడ్ డోర్ సిల్స్, థీమ్డ్ కుషన్స్ మరియు సీట్ బెల్ట్ కుషన్స్ మరియు ఫ్రంట్ డాష్ కెమెరా వంటి ఫీచర్లను కూడా పొందింది.
మెకానికల్ గా, ఫ్రెంచ్ ఆటోమేకర్ పవర్‌ట్రెయిన్ ఆప్షన్లలో ఎటువంటి మార్పులు చేయలేదు. వీటిని అలాగే కొనసాగించనుంది. C3 ఎయిర్‌క్రాస్ ధోనీ ఎడిషన్ 1.2-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ ని 6-స్పీడ్ మాన్యువల్ మరియు ఆరు-స్పీడ్ ఆటోమేటిక్ టార్క్ కన్వర్టర్ యూనిట్‌తో జతచేసి పొందవచ్చు.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్