- జూన్ 4న లాంచ్ కానున్న స్పెషల్ ఎడిషన్స్
- 'డ్రీమ్ సిరీస్'గా పిలవబడుతున్న ఈ కొత్త స్పెషల్ ఎడిషన్
ఇండియన్ మార్కెట్లో మారుతి సుజుకి తనదైన ముద్రను వేసి, సేల్స్ పరంగా దాని హవాను కొనసాగిస్తుంది. ఇప్పుడు మారుతి సుజుకి కంపెనీ, దాని ఎంట్రీ-లెవల్ హ్యాచ్‌బ్యాక్స్ సేల్స్ ని పెంచడానికి, జూన్ 4న కొత్త స్పెషల్ ఎడిషన్‌ను లాంచ్ చేయనుంది. ఈ కొత్త స్పెషల్ ఎడిషన్‌ను ‘డ్రీమ్ సిరీస్’ అని పిలుస్తుండగా, ఈ స్పెషల్ ఎడిషన్ ప్రారంభ ఎక్స్ షోరూం ధర రూ. 4.99 లక్షలు ఉండగా, అందులో ఆల్టో K10, సెలెరియో మరియు ఎస్-ప్రెస్సోతో వంటి మోడల్స్ ఉన్నాయి. ఇక్కడ మీరు ఆనందించాల్సిన అంశం ఏమిటంటే, దీని బుకింగ్స్ నేటి నుండే ప్రారంభమయ్యాయి. ఈ కొత్త ఎడిషన్ ని జూన్ నెలలో పరిమిత సంఖ్యలో విక్రయించబడే అవకాశం ఉంది.
డ్రీమ్ సిరీస్ ఎడిషన్ ద్వారా స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీతో కూడిన ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్, రివర్స్ పార్కింగ్ కెమెరా వంటి ఫీచర్లను మారుతి అందిస్తుండగా, లోయర్ వేరియంట్లలో సౌండ్ సిస్టమ్ తో పాటుగా మరిన్ని ఫీచర్లను అందించనుంది. ఈ కొత్త ఎడిషన్ హ్యాచ్‌బ్యాక్‌ల ఎంట్రీ-లెవల్ వేరియంట్‌లపై ఈ ఫీచర్లు ఆధారపడి ఉంటాయి. ప్రస్తుతం, ఆల్టో K10, ఎస్-ప్రెస్సో మరియు సెలెరియో ప్రారంభ ధర వరుసగా రూ. 3.99 లక్షలు, రూ. 4.26 లక్షలు, మరియు రూ. వరుసగా 5.36 లక్షలుగా ఉంది.
మేము ఏప్రిల్ 2024లో ఈ మోడళ్ల సేల్స్ ని పరిశీలించగా, ఈ ఇండియన్ ఆటోమేకర్ 11,519 యూనిట్ల ఆల్టో మరియు S-ప్రెస్సో కార్లను విక్రయించింది. సరిగ్గా ఏడాది క్రితం, ఏప్రిల్ 2023లో బ్రాండ్ ఈ మోడల్స్ ద్వారా 14,110 యూనిట్లను విక్రయించింది. గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం సేల్స్ సంఖ్య గణనీయంగా తగ్గింది. దీంతో వీటి సేల్స్ ని పెంచడానికి ఇప్పుడు మారుతి కంపెనీ ఈ స్పెషల్ ఎడిషన్లను తీసుకువస్తున్నట్లు మేము భావిస్తున్నాం.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్