- టాప్-స్పెక్ వెర్షన్‌తో ఏడీఏఎస్ సూట్‌ని పొందే అవకాశం
- 29 ఏప్రిల్ 2024న లాంచ్ కానున్న XUV 3XO
మహీంద్రా ఇండియా XUV 3XO ను వచ్చే వారంలో అనగా 29 ఏప్రిల్ 2024న ఇండియాలో లాంచ్ చేయడానికి సిద్ధంగా ఉంది. దీని అధికారిక లాంచ్‌కు ముందే, ఫీచర్స్, ఎక్స్‌టీరియర్ డిజైన్ మరియు ఫ్యూయల్ ఎఫిషియన్సీ కి సంబంధించిన వివరాలు ఇది వరకే మేము మీకు వెల్లడించాము. అంతేకాకుండా, లాంచ్ కానున్న XUV 300 ఫేస్‌లిఫ్ట్ కొత్త వేరియంట్‌లను పొందుతుందనే విషయాన్ని ఈ కథనంలో మనం తెలుసుకుందాం.
ప్రస్తుతం మహీంద్రా XUV 300 W2, W4, W6, W8, మరియు W8 (O) అనే 5 వేరియంట్‌లలో అందుబాటులో ఉంది. అయితే, లాంచ్ కానున్న XUV 3XOXUV700నిపోలి ఉండగా ఈ మోడల్ నుంచి వేరియంట్లను పొందనుంది. ఇది టాప్-స్పెక్ వేరియంట్‌లలో L (లగ్జరీ ప్యాక్) మరియు ప్రో వెర్షన్‌లతో పాటు MX, AX, AX5 మరియు AX7తో సహా 4 వేరియంట్లలో అందించబడుతుంది.
ఫీచర్ల విషయానికి వస్తే, మహీంద్రా XUV 3XOలో 10.25-ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్, వైర్‌లెస్ స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ ప్యానెల్, హర్మన్ కార్డన్ సోర్స్డ్ సెవెన్-స్పీకర్ మ్యూజిక్ సిస్టమ్, డ్యూయల్-జోన్ క్లైమేట్ వంటి ఫీచర్లతో పూర్తిగా రివైజ్ చేయబడిన క్యాబిన్‌ను పొందుతుంది. ఇంకా చెప్పాలంటే, కంట్రోల్, పనోరమిక్ సన్‌రూఫ్ మరియు రీడిజైన్ చేయబడిన సెంటర్ కన్సోల్, ఎస్‌యువి 360-డిగ్రీల సరౌండ్ కెమెరా, లేన్ వాచ్ కెమెరా, ఫ్రంట్ మరియు రియర్ పార్కింగ్ సెన్సార్స్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్స్, ఆటో-డిమ్మింగ్ ఒఆర్‍విఎంఎస్ మరియు ఏడీఏఎస్ (ఎడాస్) సూట్ వంటి ఫీచర్లతో వస్తుంది.
పవర్‌ట్రెయిన్ విషయానికొస్తే, XUV 3XO అదే 1.2-లీటర్ టర్బో-పెట్రోల్ మరియు 1.5-లీటర్ డీజిల్ ఇంజిన్‌తో అందించబడే అవకాశం ఉంది. ఇటీవల, బ్రాండ్ దాని పవర్‌ట్రెయిన్‌లలో ఒకదాని ఫ్యూయల్ ఎఫిషియన్సీని మరియు పెర్ఫార్మెన్స్ ఫిగర్స్ ని వెల్లడిస్తూ టీజర్‌ను రిలీజ్ చేసింది. టీజర్ ప్రకారం, ఈ ఇంజిన్ ఏఆర్ఏఐ- సర్టిఫైడ్ 20.1కెఎంపిఎల్ ఫ్యూయల్ ఎఫిషియన్సీని అందిస్తుండగా మరియు కేవలం జీరో నుంచి 4.5 సెకన్లలో 60కెఎంపిహెచ్ వేగాన్ని అందుకుంటుంది.
అనువాదించిన వారు: రాజపుష్ప