- అక్టోబరు 3న ఇండియాలో లాంచ్
- కార్నివాల్ తో పాటుగా వస్తున్న EV9
ఫుల్లీ లోడెడ్ వేరియంట్
అక్టోబరు 3వ తేదీన ఇండియాలో కియా EV9లాంచ్ కానుండగా, ఇండియన్ మార్కెట్లో వస్తున్న మొట్టమొదటి మూడు-వరుసల ఎలక్ట్రిక్ వెహికిల్ ఇదే. ఎస్‍యూవీ రాకకు ముందుగా, కార్ వాలే దీనికి సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకుంది. లాంచ్ సమయానికి ఇది మొదటి ఫుల్లీ లోడెడ్ GT-లైన్ ఏడబ్లూడీ మోడల్ గా అందించబడుతుంది.
GT-లైన్ ఏడబ్లూడీ
GT-లైన్ ఏడబ్లూడీ అత్యంత ఖరీదైన EV9 కాగా, మీరు దీనిని ఆకర్షణీయమైన అదనపు ఫీచర్లతో పొందవచ్చు. ఎందుకంటే, EV9 కోసం అలాంటి కలెక్షన్లను కియా కలిగి ఉంది. ఎక్స్‌టీరియర్ పరంగా, బయటి వైపు GT-లైన్ ప్యాకేజీ వివిధ రకాల బంపర్లను, 21-ఇంచ్ GT-లైన్ వీల్స్ మరియు కారు వెనుక భాగంలో GT-లైన్ బ్యాడ్జింగ్ ని పొందుతుంది.
ఈ వెర్షన్ 6-సీట్ మరియు 7-సీట్ లేఅవుట్ లలో లభిస్తుండగా, ఇందులో 7-సీట్ లేఅవుట్ ని మాత్రమే ఇండియన్-స్పెక్ EV9లో ఆశించవచ్చు. అలాగే ఇది ఫీచర్లలో అన్ని ఎలక్ట్రిక్ సీట్లు, రెండవ వరుస సీట్లలో లాంజ్ ఫంక్షన్, మల్టీ-జోన్ క్లైమేట్ కంట్రోల్, రెండవ వరుసలో వెంటిలేటెడ్ సీట్లు, 360-డిగ్రీ కెమెరా, లెవెల్-2 ఎడాస్ (ఏడీఏఎస్), ఆటో పార్కింగ్, కనెక్టెడ్ కార్ టెక్నాలజీ, పవర్ బూట్ ఓపెనింగ్ మరియు పూర్తి ఎల్ఈడీ లైట్ ప్యాకేజీ వంటి వాటిని పొందుతుంది. సౌత్ కొరియన్ మార్కెట్లో, వైట్ కి బదులుగా బ్లాక్ కలర్, బ్లాక్ తో నేవీ బ్లూ మరియు బ్లాక్ తో బ్రౌన్ ఇంటీరియర్ థీమ్ ని పొందనుంది.
పవర్ ట్రెయిన్ మరియు రేంజ్
ప్రపంచవ్యాప్తంగా, ఏడబ్లూడీ టైపులో EV9మోడల్ 99.9kWh బ్యాటరీ ప్యాక్ తో అందించబడగా, ఈ బ్యాటరీ ప్యాక్ డ్యూయల్ మోటార్ సెటప్ తో జతచేయబడి 379bhp మరియు 700Nm టార్కును ఉత్పత్తి చేస్తుంది. అలాగే ఇది 445 కిలోమీటర్ల క్లెయిమ్డ్ డ్రైవింగ్ రేంజ్ ని అందిస్తుండగా, కేవలం 5.3 సెకన్లలో 0-100 కెఎంపిహెచ్ వేగాన్ని చాలా ఈజీగా అందుకుంటుంది. అదే విధంగా టాప్ స్పీడ్ ఎంతో షాక్ అవ్వాల్సిందే, ఎందుకంటే ఇది గంటకు 200 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తుంది.
2 వేల కిలోలకు పైగా బరువు ఉన్న కారు నుంచి మనం ఇలాంటి అద్బుతమైన నంబర్లను ఆశించడంలో ఏమాత్రం తప్పులేదు. 350kWh ఛార్జర్ ని ఉపయోగించి, కేవలం 24 నిమిషాల్లో దీని బ్యాటరీ ప్యాక్ ని 10-80 శాతం వరకు ఛార్జ్ చేయవచ్చు. దీని ఇంకా చెప్పాలంటే, ఈ కారు ఇండియాలో లాంచ్ అయ్యే సమయానికి ప్యాకేజీలో భాగంగా, కియా హోమ్ వాల్ బాక్స్ ఛార్జర్ ని అందిస్తుందని భావిస్తున్నాం.
టాప్-స్పెక్ ధర రేంజ్
ఎంత లేదనుకున్నా, ఈ కారు ధర రూ.90 లక్షల నుంచి రూ.1.20 కోట్ల మధ్య ఉంటుందని అంచనా వేస్తున్నాం. ఒకవేళ ఈ ధరతో ఇండియాలో లాంచ్ అయితే, ఇదే అత్యంత ఖరీదైన కారుగా నిలుస్తుంది. ఇది కంప్లీట్ బిల్ట్ యూనిట్ గా ఇండియాకు రానుంది అనే అంశంలో కొంత వరకు నిజం ఉన్నా, టాప్-స్పెక్ ఫుల్లీ-లోడెడ్ మోడల్ గా రానుంది. ఫుల్లీ-లోడెడ్ కారు లాంచ్ కానుండగా, దీని తర్వాత వచ్చే ఎలక్ట్రిక్ కారెన్స్ కారుపై అంచనాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. కారెన్స్ ఈవీ కూడా 2025లో లాంచ్ కానుంది.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్