- N లైన్ లోని 2 వేరియంట్లలో అందించబడనున్న హ్యుందాయ్ క్రెటా N ఫేస్‌లిఫ్ట్
- 1.5-లీటర్ టర్బో-పెట్రోల్ పవర్డ్ ఇంజిన్‌తో లభ్యం
హ్యుందాయ్ క్రెటా ఫేస్‌లిఫ్ట్ ప్రారంభానికి కొన్ని గంటల ముందు, మేముఎస్‍యూవీలో N లైన్ వెర్షన్ యొక్క ప్రత్యేక వివరాలను పొందాము. క్రెటా i20 N లైన్ మరియు వెన్యూ N లైన్ తర్వాత ఇండియాలో హ్యుందాయ్ తన మూడవ N లైన్ ను అందించనుంది.
క్రెటా N లైన్ విషయానికి వస్తే, ఈ మోడల్ యొక్క పవర్డ్ 1.5-లీటర్, టర్బో-పెట్రోల్ ఇంజిన్‌తో 158bhp మరియు 253Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్ 6-స్పీడ్ మాన్యువల్ లేదా 7-స్పీడ్ డిసిటి యూనిట్ ద్వారా ముందు వీల్స్ కి పవర్ ని సప్లై చేస్తుంది.
2024 హ్యుందాయ్ క్రెటా N లైన్ N8 మరియు N10 అనే రెండు వేరియంట్లలో అందుబాటులోకి రానుంది. డిసిటిని రెండు వేరియంట్‌లలో పొందవచ్చు, అయితే N10 వేరియంట్‌కు ఎంటి ప్రత్యేకమైనది. మరో వైపు ఇతర చోట్ల, వెనిలా వెర్షన్‌పై క్రెటా ఎన్ లైన్లో చిన్న చిన్న అప్‌డేట్‌లను పొందుతుందని మరియు లోపలి భాగంలో కూడా కొన్ని ప్రత్యేక మార్పులను పొందవచ్చు అని మేము ఆశిస్తున్నాము.
అనువాదించిన వారు: రాజపుష్ప