- 2 వేరియంట్లలో అందించబడనున్న C3 ఎయిర్ క్రాస్
- రూ. 25 వేలుగా ఉన్న బుకింగ్ అమౌంట్
సిట్రోన్ ఇండియా తన మోడల్ C3 ఎయిర్ క్రాస్ యొక్క ఆటోమేటిక్ వేరియంట్స్ లాంచ్ ద్వారా తన వేగాన్ని మరింత రెట్టింపు చేసింది. ఆసక్తి కలిగిన కస్టమర్లు ఈ ఎస్యూవీని రూ.25,000 టోకెన్ అమౌంట్ తో సెలెక్టెడ్ డీలర్ షిప్స్ వద్ద ప్రీ-బుక్ చేసుకోవచ్చు. ప్రస్తుతం, ఈ 5+2-సీటర్ ఎస్యూవీ యూ, ప్లస్, మరియు మ్యాక్స్ అనే 3 వేరియంట్లలో రూ. 9.99 లక్షలు (ఎక్స్-షోరూం) ప్రారంభ ధరతో అందుబాటులో ఉంది.
మాకు అందిన సమాచారం మేరకు, C3 ఎయిర్ క్రాస్ ప్లస్ మరియు మ్యాక్స్ అనే 2 ఆటోమేటిక్ వేరియంట్లను పొందనుంది. ఇంకా, 6-స్పీడ్ ఆటోమేటిక్ టార్క్ కన్వర్టర్ తో కొత్త గేర్ బాక్స్ ఉండనుంది. ఇప్పటికే దీనిని ఇండోనేషియన్ మార్కెట్లో పరిచయం చేసినట్లు విశ్వసనీయ వర్గాల నుంచి మాకు సమాచారం అందింది.
ప్రస్తుతం, సిట్రోన్ C3 ఎయిర్ క్రాస్ యొక్క 1.2-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్ 6-స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్సుతో జతచేయబడింది. ఈ మోటార్ 109bhp పవర్ మరియు 190Nm పీక్ టార్కును ఉత్పత్తి చేయడంతో పాటుగా, 18.5కెఎంపిఎల్ (ఏఆర్ఏఐ ప్రకారం) క్లెయిమ్డ్ మైలేజీ అందిస్తుంది.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్