- రోడ్డు, రవాణా మరియు హైవేల మంత్రిత్వ శాఖ ట్రాన్స్‌పోర్ట్ రీసెర్చ్ వింగ్ రిపోర్ట్ వెల్లడి
- టాప్-10లో వరుసగా 7,8 స్థానాల్లో నిలిచిన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్
అనునిత్యం ఇండియన్ రోడ్లపై ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి. కొన్నిసార్లు ఈ రోడ్డు ప్రమాదాలు మనిషి జీవనస్థితిగతినే మార్చేస్తాయి. రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జాతీయ రహదారులపై జరుగుతుండగా, రాష్ట్ర రహదారులు రెండో స్థానంలో ఉన్నాయి. ఈ రోడ్డు ప్రమాదాల్లో చాలామంది తమ ప్రాణాలు పోగొట్టుకోగా, అనేక మంది అంగవైకల్యం చెందారు. ఈ ప్రమాదాలన్నింటికీ ముఖ్య కారణం మితిమీరిన వేగమే. ఇందులో కొన్నిసార్లు మనం వాహనాన్ని వేగంగా నడపవచ్చు, మరికొన్నిసార్లు ఇతర వాహనాలు వేగంగా వచ్చి మన వాహనాన్ని ఢీకొనవచ్చు. అయితే తాజాగా మనం రాష్ట్రాల వారీగా రోడ్డు ప్రమాదాల కారణంగా సంభవించిన మరణాల రేటును, గాయపడిన వారి రేటు గురించి ఇండియన్ గవర్నమెంట్ విడుదల చేసిన రోడ్డు ప్రమాదాలు -2022 ద్వారా తెలుసుకుందాం.
రోడ్డు ప్రమాదాలకు ముఖ్య కారణాలేంటి ?
ముఖ్యంగా రోడ్డు ప్రమాదాలకు కారణాలుగా ఏం ఉంటాయో ముందు మనం తెలుసుకుందాం. అవి ఏవి అంటే, ఓవర్ స్పీడ్, డ్రంక్ అండ్ డ్రైవ్, రాంగ్ రూట్ లో డ్రైవ్ చేయడం, రెడ్ లైట్ సిగ్నల్ నీ జంప్ చేయడం, డ్రైవింగ్ చేస్తూ మొబైల్ ఫోన్లో మాట్లాడడం, మానవ తప్పిదాలు మరియు ఇతర కారణాలు ఉండవచ్చు. వీటిపై మనకు పూర్తి అవగాహన కలిగి ఉంటే, వాటిని సక్రమంగా అమలుపరిస్తే చాలా వరకు రోడ్డు ప్రమాదాలు మనం అరికట్టవచ్చు.
తాజా రిపోర్టు ఏం చెబుతుంది ?
తాజాగా విడుదల చేసిన ఈ రిపోర్టులో రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాలతో కలిపి మొత్తం 4,61,312 రోడ్డు ప్రమాదాలు జరిగాయి. గత సంవత్సరం జరిగిన 4,43,366 రోడ్డు ప్రమాదాలతో పోలిస్తే ప్రస్తుతం 11.9% పెరిగింది. ప్రత్యేకించి జాతీయ రహదారులపై 1,51,997 రోడ్డు ప్రమాదాలు, రాష్ట్ర రహదారులపై 1,06,682 రోడ్డు ప్రమాదాలు కాగా, ఇతర రోడ్లపై 2,02,633 రోడ్డు ప్రమాదాలు జరిగాయి.
టాప్-10లో మనం ఎక్కడ ఉన్నాం ?
రోడ్డు ప్రమాదాలకు సంబంధించిన టాప్-10లో నిలిచిన రాష్ట్రాల లిస్టును భారత ప్రభుత్వం విడుదల చేసింది. ఇందులో ముఖ్యంగా చెప్పాలంటే, అత్యధిక రోడ్డు ప్రమాదాలతో తమిళనాడు మొదటి స్థానంలో నిలిచింది. తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ వరుసగా 7, 8 స్థానాల్లో నిలిచాయి. ఇక తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే, 2022 రిపోర్టు ప్రకారం తెలంగాణలో 7,505 రోడ్డు ప్రమాదాలు జరగగా, ఆంధ్రప్రదేశ్ లో 8,650 రోడ్డు ప్రమాదాలు జరిగాయి. 2021తో పోలిస్తే రెండు రాష్ట్రాల్లో వరుసగా 5.7% మరియు 4.9% శాతం రోడ్డు ప్రమాదాలు పెరిగాయి. జాతీయ రహదారులపై జరుగుతున్న రోడ్డు ప్రమాదాల సంఖ్యను ఈ లిస్టు ద్వారా మనం తెలుసుకుందాం
క్రమ సంఖ్య | రోడ్డు ప్రమాదాల సంఖ్య |
తమిళనాడు | 18,972 |
కేరళ | 17,627 |
ఉత్తరప్రదేశ్ | 14,990 |
మధ్యప్రదేశ్ | 13,860 |
కర్ణాటక | 13,384 |
మహారాష్ట్ర | 9,417 |
ఆంధ్రప్రదేశ్ | 8,650 |
తెలంగాణ | 7,505 |
రాజస్థాన్ | 7,093 |
బీహార్ | 4,601 |