- జిఎన్ క్యాప్ క్రాష్ టెస్ట్స్ లేటెస్టు రౌండు నిర్వహణ
- 2021లో అడల్ట్ సేఫ్టీలో 4-స్టార్ సేఫ్టీ రేటింగ్ ని పొందిన ట్రైబర్
ఇండియాలో తయారైన రెనాల్ట్ ట్రైబర్ ఆఫ్రికన్ మార్కెట్లలో విక్రయించబడుతుండగా, లేటెస్టుగా గ్లోబల్ న్యూ కార్ అసెస్ మెంట్ ప్రోగ్రాం (జిఎన్ క్యాప్) క్రాష్ టెస్టులలో దాని ఎంట్రీని ఇచ్చింది. రిపోర్ట్స్ ద్వారా వెల్ల్లడైంది ఏంటి అంటే, ఈ ఎంపివి జిఎన్ క్యాప్ క్రాష్ టెస్టులో 2-స్టార్ సేఫ్టీ రేటింగ్ ని అందుకుంది.
నాలుగు నుంచి రెండుకు పడిపోయిన సేఫ్టీ రేటింగ్
2021 సంవత్సరంలో నిర్వహించిన క్రాష్ టెస్టులో ఈ కారు అడల్ట్ ప్రొటెక్షన్ విభాగంలో 4-స్టార్ సేఫ్టీ రేటింగ్ మరియు చైల్డ్ ప్రొటెక్షన్ విభాగంలో 3-స్టార్ సేఫ్టీ రేటింగ్ అందుకుంది. అయితే, లేటెస్టుగా నిర్వహించిన క్రాష్ టెస్టులలో దీనికి పూర్తి విరుద్ధంగా పేలవ ప్రదర్శనతో 2-స్టార్ రేటింగ్ అందుకుని అందరిని నిరాశపరిచింది. ఈ కారు డ్రైవర్ హెడ్ (తల) మరియు మెడ భాగంలో మంచి ప్రొటెక్షన్ ని అందిస్తుండగా, డ్రైవర్ చెస్ట్ (ఛాతి) భాగంలో ముందు మరియు సైడ్ ఇంపాక్ట్ పరంగా చాలా పేలవమైన ప్రొటెక్షన్ ని అందిస్తున్నట్లు రిపోర్టులో వెల్లడైంది. ఐసోఫిక్స్ యాంకరేజ్ పాయింట్లు లేకపోవడం వల్ల హెడ్ (తల), మెడ మరియు ఛాతీకి ఎక్స్‌పోజర్ కోసం చైల్డ్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్ లో డమ్మీలు ఉంచగా, వాటిపై పేలవమైన పెర్ఫార్మెన్స్ ని అందించింది.
క్రాష్ టెస్ట్స్ మరియ వాటి పెర్ఫార్మెన్స్
జిఎన్ క్యాప్ క్రాష్ టెస్ట్ ప్రోటోకాల్స్ ఇప్పుడు అన్ని వాహనాలకు ఫ్రంట్ మరియు సైడ్ ఇంపాక్ట్ తో పాటు ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ఈ ఎస్ సీ) తప్పనిసరి అని నిర్దారించాయి. ఎక్కువ స్టార్లు పొందాలంటే కార్లు పెడెస్ట్రియన్ (పాదాచారుల) ప్రొటెక్షన్లో మరియు సైడ్ పోల్ ఇంపాక్ట్ లో మంచి స్కోరు సాధించాలి. ఆఫ్రికాలో సేల్స్ ప్రారంభంకావడంతో రెనాల్ట్ ట్రైబర్ పై సేఫ్టీ టెస్టులు నిర్వహించబడ్డాయి, అందులో ఈ కారు తక్కువ సేఫ్టీ రేటింగ్స్ పొందడంతో వీటిలో సేఫ్టీ పెర్ఫార్మెన్స్ ఆందోళనకరంగా మారింది. ఈ తక్కువ సేఫ్టీ రేటింగ్స్ వివిధ బ్రాండ్లకు ఒక మేల్కొలుపు వంటివి. ఎందుకంటే, భవిష్యత్తులో ఇవి మరిన్ని సేఫ్టీ ఫీచర్లతో అడల్ట్ మరియు చైల్డ్ ప్రొటెక్షన్లో బెస్ట్ సేఫ్టీని అందించే అవకాశం ఉంది.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్