- 2024లో బ్రెజిల్ లో కార్డియన్ ఎస్‌యువితో అరంగేట్రం
- ఇండియాలో న్యూ సి-ఎస్‌యువిలతో వచ్చే అవకాశం
కొత్త పెట్రోల్ ఇంజిన్
కార్డియన్ కాంపాక్ట్ ఎస్‌యువి కొత్త 1.0-లీటర్ జిడిఐ టర్బో పెట్రోల్ ఇంజిన్ తో వస్తున్నట్లు రెనాల్ట్ బ్రెజిల్‌లో వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా 2027లో రెనాల్ట్ వృద్ధి ప్రణాళికలలో భాగంగాపలు రకాలుగా అభివృద్ది చెందుతున్నమార్కెట్లలో ఈ కొత్త ఫ్లెక్స్-ఫ్యూయల్ కు అనుకూలమైన ఇంజిన్ ను ప్రవేశపెట్టాలని ఒక మార్గాన్ని కనుగొంటుంది.
స్పెసిఫికేషన్స్ మరియు గేర్ బాక్స్ ఆప్షన్స్
ఈ కొత్త ఇంజిన్ 125bhp మరియు 220Nm టార్క్ ని ఉత్పత్తి చేస్తుంది. ప్రత్యేకంగా, ఇది 6-స్పీడ్ డ్యూయల్-క్లచ్ ట్రాన్స్‌మిషన్‌తో అందుబాటులో ఉంది. ఇది ఇప్పటికే ఇండియాలో సరికొత్త 3-సిలిండర్ 1.0-లీటర్ ఇంజిన్ ల ఉండగా సివిటి మరియు 5-స్పీడ్ మాన్యువల్‌తో జతచేయబడి 99bhp/152Nm/160Nm ఉత్పత్తి చేస్తుంది.
1.0-లీటర్ న్యూ మంత్రమా?
1.0-లీటర్ ఇంజిన్ దేశంలో లభిస్తున్న స్కోడా మరియు ఫోక్స్‌వ్యాగన్‌లతో సబ్-4 ఎస్‌యువి సెగ్మెంట్‌లో కొత్త పవర్ ఫిలాసఫీగా మారింది. బిఎస్6 రావడంతో రెనాల్ట్ డీజిల్‌లను ఉత్పత్తి నుండి తప్పుకున్ కారణంగా, ఈ ఇంజిన్ వచ్చే ఏడాది దాని నుండి వచ్చే కొత్త సి-ఎస్‌యువిలకు పవర్ ని అందించేదిగా కనిపిస్తోంది.
మొదటగా చెప్పాలంటే, 1.3-లీటర్ టర్బో పెట్రోల్ డస్టర్‌తో పొందిన 154bhp/254Nm కంటే ఎక్కువగా అవుట్‌పుట్ ఇందులో ఉండకపోవచ్చు, కాకపోతే పేపర్ పై వీటి గురించి మాత్రం సరిపోతుందని అని చెప్పవచ్చు. అయితే మీరు ఇందులోని సౌకర్యాలు పరిగణించినప్పుడు దాని స్థానంలో ఇప్పటికే ఉన్న ఇంజిన్‌ను స్థానికంగా తయారు చేసి పొందవచ్చు.
అనువాదించిన వారు: రాజపుష్ప