- బ్లాక్ మరియు వైట్ థీమ్ తో వచ్చిన అన్నీ మోడల్స్
- కేవలం 1,600 స్పెషల్ ఎడిషన్ యూనిట్లు మాత్రమే కేటాయింపు
ప్రస్తుతం విక్రయించబడుతున్న క్విడ్, కైగర్, ట్రైబర్ మోడల్స్ లో రెనాల్ట్ కంపెనీ కొత్తగా నైట్ & డే ఎడిషన్లను లాంచ్ చేసింది. 1600 యూనిట్లతో అతి తక్కువ సంఖ్యలో మాత్రమే లభిస్తున్న ఈ స్పెషల్ ఎడిషన్లు డ్యూయల్-టోన్ ఎక్స్‌టీరియర్ మరియు కొత్త ఫీచర్లను కలిగి ఉన్నాయి.
రెనాల్ట్ క్విడ్ లో ప్రస్తుతం అందించబడుతున్న RXL (O) మాన్యువల్ వెర్షన్ అధారంగా వచ్చిన కొత్త నైట్ & డే స్పెషల్ ఎడిషన్ ఎక్స్-షోరూం ధర రూ.4.99 లక్షలుగా ఉంది. అలాగే, కైగర్ నైట్ & డే స్పెషల్ ఎడిషన్ మాన్యువల్ వెర్షన్ ఎక్స్-షోరూం ధర రూ. 6.75 లక్షలు ఉండగా, ఆటోమేటిక్ వెర్షన్ ఎక్స్-షోరూం ధర రూ.7.25 లక్షలుగా ఉంది. RXL వేరియంట్ల ఆధారంగా వచ్చిన ఈ స్పెషల్ ఎడిషన్ల ధర కేవలం రూ.15 వేలు మాత్రమే ఎక్కువగా ఉంది. మరోవైపు, ట్రైబర్ నైట్ & డే ఎడిషన్ కూడా RXL వెర్షన్ ఆధారంగా రాగా, ఈ స్పెషల్ ఎడిషన్ ధర స్టాండర్డ్ వేరియంట్ ధర రూ.7 లక్షలతో పోలిస్తే రూ.20 వేలు ఎక్కువగా ఉంది.
క్విడ్, కైగర్, మరియు ట్రైబర్ కార్లు అన్నీ కూడా ఆయా కార్లు డ్యూయల్-టోన్ కలర్ ని అందించడానికి ఎక్స్‌క్లూజివ్ గా మిస్టరీ బ్లాక్ రూఫ్ తో పెర్ల్ వైట్ బాడీ కలర్ తో అందుబాటులోకి వచ్చాయి. ఈ స్పెషల్ ఎడిషన్ కార్లలోని ఇతర కాస్మోటిక్ అప్ డేట్ల విషయానికి వస్తే, ఇందులో పియానో బ్లాక్ గ్రిల్, వీల్ కవర్స్, నంబర్ ప్లేట్లు, మరియు ఓఆర్‌విఎంస్ ఉన్నాయి. కైగర్ పై టెయిల్ గేట్ గార్నిష్ కూడా పియానో బ్లాక్ ఫినిషింగ్ కలిగి ఉంది. కీలక ఫీచర్లు మరియు అంశాల పరంగా, కైగర్ మరియు ట్రైబర్ కార్లు వైర్ లెస్ స్మార్ట్ ఫోన్ మిర్రరింగ్ తో 9-ఇంచ్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టం మరియు రియర్ వ్యూ కెమెరా వంటి ప్రత్యేక ఫీచర్లను కలిగి ఉన్నాయి. అదనంగా ట్రైబర్ నైట్ & డే ఎడిషన్ కారు రియర్ పవర్ విండోలను పొందింది.
వీటిని ఎలా బుక్ చేసుకోవాలి అంటే, దేశవ్యాప్తంగా ఉన్న రెనాల్ట్ అధికారిక డీలర్ షిప్స్ వద్ద క్విడ్, కైగర్, మరియు ట్రైబర్ నైట్ & డే ఎడిషన్ కార్ల బుకింగ్స్ రేపు అనగా సెప్టెంబర్ 17వ తేదీన ప్రారంభంకానున్నాయి. కాబట్టి మీరు, రెనాల్ట్ అధికారిక డీలర్ షిప్స్ వద్ద బుక్ చేసుకోవచ్చు. ఈ నైట్ & డే స్పెషల్ ఎడిషన్లు అన్నీ మోడల్స్ లో కలిపి 1,600 యూనిట్లు మాత్రమే అందించబడిన కారణంగా, ముందుగా వీటిని ఎవరు బుక్ చేసుకొంటే వారికే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్