- రెనాల్ట్ కస్టమర్ల కోసం అందుబాటులో ప్రత్యేక లాయల్టీ బోనస్
- కార్పొరేట్ మరియు రూరల్ కస్టమర్స్ కోసం అదనపు బెనిఫిట్స్
రెనాల్ట్ ఇండియా అన్ని మోడల్స్ పై పండుగ ఆఫర్ల రేంజ్ ని వెల్లడించింది. కస్టమర్‌లు ఈ డిస్కౌంట్స్ ను వివిధ బెనిఫిట్స్ మరియు పెర్క్‌ల రూపంలో పొందవచ్చు, వీటన్నింటిని మేము క్రింద వివరించాము.
రెనాల్ట్ కైగర్సబ్-ఫోర్-మీటర్ ఎస్‌యువి రూ.65,000 బెనిఫిట్ తో అందించబడుతోంది. ఇందులో క్యాష్ డిస్కౌంట్ రూ. 25,000, ఎక్స్ఛేంజ్ బోనస్ రూ. 20,000, మరియు అదనపు లాయల్టీ బెనిఫిట్స్ అందించబడతాయి. అదే విధంగా, క్విడ్ మరియు ట్రైబర్ ఒక్కోదానిపై రూ.50,000 వరకు బెనిఫిట్స్ లభించనుండగా, ఇందులో రూ.20,000 వరకు క్యాష్ డిస్కౌంట్, రూ. 20,000ఎక్స్ఛేంజ్ బెనిఫిట్, మరియు అదనపు లాయల్టీ బోనస్ ను పొందవచ్చు.
పైన పేర్కొన్న సాధారణ వినియోగదారుల ఆఫర్‌లతో పాటు, రెనాల్ట్ తన ప్రస్తుత కస్టమర్ల కోసం కాంప్లిమెంటరీ థర్డ్-ఇయర్ వారంటీ, మూడేళ్ల మెయింటెనెన్స్ ప్యాకేజీ మరియు మూడు సంవత్సరాల రోడ్‌సైడ్ అసిస్టెన్స్‌ని అందించడంతో పాటు ప్రత్యేక లాయల్టీ ప్యాకేజీని కూడా ప్రవేశపెట్టింది. అలాగే ఈ ఆఫర్‌లో ఏదైనా రెనాల్ట్ వాహనాన్ని కొనుగోలు చేస్తే రూ. 20,000వరకు అదనపు క్యాష్ బెనిఫిట్ ను పొందవచ్చు.
ఇంకా, రెనాల్ట్ ఇండియా మరో రేంజ్ ఆఫర్‌లను అందుబాటులోకి తెచ్చింది, ఇది సెలెక్ట్చేసిన క్రైటీరియా పై ఆధారపడి ఉంటుంది. కస్టమర్లు రూ.12,000 వరకు అదనపు కార్పొరేట్ డిస్కౌంట్ ను పొందవచ్చు. రూరల్ ఆఫర్‌లో రైతులు, సర్పంచ్ మరియు గ్రామ పంచాయతీ సభ్యులకు రూ. 5,000 వరకు డిస్కౌంట్ ఉంటుంది.అంతేకాకుండా, ఇంతకు ముందున్నరెనాల్ట్ కస్టమర్‌లు ఈ ఫ్రెంచ్ బ్రాండ్‌కు చెందిన కార్లను రిఫర్ చేయవచ్చు. మరియు కొనుగోలు ఆధారంగా, రిఫర్ చేసే కస్టమర్ మరియు రిఫరల్ ను పొందిన కస్టమర్ ఇద్దరూ రూ.10,000 వరకు బెనిఫిట్స్ పొందే అవకాశం ఉంది.
ఈ సందర్భంగా రెనాల్ట్ ఇండియా సేల్స్ మరియు మార్కెటింగ్ వైస్ ప్రెసిడెంట్ సుధీర్ మల్హోత్రా మాట్లాడుతూ, 'మా మూడు అద్భుతమైన మోడళ్లైన ట్రైబర్, కైగర్ మరియు క్విడ్‌పై మా ప్రత్యేకమైన పండుగ సీజన్ ఆఫర్‌లను ప్రకటించడం మాకు చాలా ఆనందంగా ఉంది. రెనాల్ట్ ఇండియా ద్వారా మేము ఈ పండుగ సీజన్‌ను మా కస్టమర్‌లకు మరింత ప్రత్యేకం చేయాలని భావిస్తున్నాము. మాపై వారికున్న నిరంతర విశ్వాసం మరియు మద్దతును బట్టి ఈ బెనిఫిట్స్ ను ఒక టోకెన్ లాగా వారికి ఇస్తున్నాము. ఈ పండుగ సీజన్‌లో రెనాల్ట్‌ను డ్రైవింగ్ చేసి ఆనందాన్ని పొందడానికి ప్రతి ఒక్కరినీ మేము ఆహ్వానిస్తున్నాము!' అని తెలిపారు.
అనువాదించిన వారు: రాజపుష్ప