- వెల్లడైన వివిధ ఎస్‍యూవీల టెస్టింగ్ మైలేజీ వివరాలు
- వెల్లడైన టాప్ పెట్రోల్ ఆటోమేటిక్ ఎస్‍యూవీల పవర్ ట్రెయిన్ల వివరాలు
ఇండియాలో ప్రస్తుతం కాంపాక్ట్ ఎస్‍యూవీలలో అత్యధికంగా విక్రయించబడుతూ, మాస్ మార్కెట్ సెగ్మెంట్లో ట్రెండింగ్ లో కొనసాగుతున్న కార్లతో పాటుగా మోస్ట్ హాట్-సెల్లింగ్ కార్ల గురించి ఇప్పుడు మీరు తెలుసుకోబోతున్నారు. స్పెసిఫిక్ గా చెప్పాలంటే, అందులో మహీంద్రా XUV 3XO, హ్యుందాయ్ వెన్యూ, మారుతి సుజుకి బ్రెజా, టాటా నెక్సాన్, కియా సోనెట్, రెనాల్ట్ కైగర్ మరియు నిసాన్ మాగ్నైట్ వంటి టాప్ కార్లు ఉన్నాయి. ఇక్కడ పేర్కొన్న అన్ని మోడల్స్ పై మేము రియల్ వరల్డ్ మైలేజీ టెస్ట్ నిర్వహించగా, వాటి పవర్ ట్రెయిన్లు, స్పెసిఫికేషన్లు మరియు వాటి మైలేజీ వివరాలు కింద ఇవ్వబడ్డాయి.
మహీంద్రా XUV 3XO
ప్రస్తుతం టాప్ సెల్లింగ్ మోడల్ గా కొనసాగుతున్న 3XO మోడల్ ప్రస్తుతం విక్రయించబడుతున్న XUV300 ఆధారంగా రాగా, ఇది పెట్రోల్ మరియు డీజిల్ ఇంజిన్ ఆప్షన్లను పొందింది. ఇప్పుడు మేము 1.2-లీటర్ టర్బోచార్జ్డ్ ఎంస్టాలియన్ టిజిడిఐ పెట్రోల్ ఇంజిన్ పై ఫోకస్ పెట్టగా, ఇది 6-స్పీడ్ ఆటోమేటిక్ తో జతచేయబడి వచ్చింది. ఈ ఇంజిన్ ఆటోమేటిక్ లో 128bhp మరియు 250Nm టార్కును ఉత్పత్తి చేస్తుండగా, మాన్యువల్ లో 230Nm టార్కును ఉత్పత్తి చేస్తుంది.
ఈ కారు లీటరుకు 18.2 కిలోమీటర్ల మైలేజీ అందిస్తుందని ఏఆర్ఏఐ ద్వారా క్లెయిమ్ చేయబడగా, మేము ఈ ఎస్‍యూవీపై టెస్టింగ్ నిర్వహించగా, సిటీలో 9.61 కిలోమీటర్ల మైలేజీ మరియు హైవేలపై 18.08 కిలోమీటర్ల మైలేజీని అందించింది. మైలేజీ పరంగా ఇవి చాలా మంచి నంబర్లుగా చెప్పవచ్చు. అలాగే ఈ కారు 1,420 కిలోల బరువు ఉంది. ఇతర కార్లతో పోలిస్తే ఈ కారు ఎక్కువ బరువును కలిగి ఉంది.
హ్యుందాయ్ వెన్యూ
హ్యుందాయ్ వెన్యూ కారు హై-టెక్ 1.0-లీటర్ 3-సిలిండర్ డైరెక్ట్-ఇంజెక్షన్ టర్బో పెట్రోల్ ఇంజిన్ ని పొందగా, ఈ ఇంజిన్ 118bhp మరియు 172Nm టార్కును ఉత్పత్తి చేస్తుంది. మోస్ట్ పవర్ ఫుల్ 1.0-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్ ప్యాడిల్ షిఫ్టర్లతో 7-స్పీడ్ డ్యూయల్-క్లచ్ ఆటోతో అందించబడింది. ఈ కారు లీటరుకు 18.3 కిలోమీటర్ల మైలేజీ అందిస్తుందని ఏఆర్ఏఐ ద్వారా క్లెయిమ్ చేయబడింది.
వెన్యూ కారు చాలా సైలెంట్ మరియు రీఫైన్డ్ పెట్రోల్ ఇంజిన్ ని కలిగి ఉంది. ఈ కారు బరువు 1,200 కిలోలు ఉండగా, ఇది సిటీలో 12.58 కిలోమీటర్ల మైలేజీని మరియు హైవేలపై 18.8 కిలోమీటర్ల మైలేజీని అందించింది. స్మూత్ డిసిటి తో ఇవి బెస్ట్ నంబర్స్ అని చెప్పవచ్చు.
మారుతి సుజుకి బ్రెజా
మారుతి సుజుకి బ్రెజా కొంచెం ఓల్డ్ కారు కాగా, అయినప్పటికీ ఈ కారు మోడరన్ ఫీచర్లతో అప్‌డేట్ చేయబడింది. ఇందులోని 1.5-లీటర్ ఇంజన్ 102bhp మరియు 136Nm టార్కును ఉత్పత్తి చేస్తుంది. ఇందులోని పవర్ ఫుల్ 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ సిటీలో స్పీడ్ కి మరియు హైవేపై స్పీడ్ కి కూడా సరిపోతుందని నిరూపించబడింది. ప్యాడిల్ షిఫ్టర్స్ అద్భుతమైన రెస్పాన్స్ తో రెండవ దానికి చాలా ఉపయోగకరంగా ఉంది. ఈ కారు1,230 కిలోలబరువు ఉన్నప్పటికీ, మోస్ట్ ఫ్యూయల్-ఎఫిషియంట్ గా పేర్కొనబడి, సిటీలో ఇది లీటరుకు 13.1 కిలోమీటర్ల మైలేజీని మరియు హైవేపై 18.63 కిలోమీటర్ల మైలేజీని అందిస్తుంది.
టాటా నెక్సాన్
టాటా మోటార్స్ నుండి మరొక అప్ డేటెడ్ కాంపాక్ట్ ఎస్‍యూవీ ఏంటి అంటే, అది నెక్సాన్ కారు. ఈ కారులోని 1.2-లీటర్ మూడు-సిలిండర్ టర్బో పెట్రోల్ ఇంజన్ 118bhp మరియు 170Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఆసక్తికరమైన విషయం ఏంటి అంటే, ఈఎస్‍యూవీ 7-స్పీడ్ డిసిఎ గేర్‌బాక్స్‌ను పొందగా, ఇది బూస్ట్ మోడ్ లో లేనప్పుడు టర్బో-పెట్రోల్ ని లో-ఎండ్ వరకు తీసుకువస్తుంది. నెక్సాన్ కారు 1,310 కిలోల బరువును కలిగి ఉండగా, దాని ఫ్యూయల్-ఎఫిషియన్సీని ప్రభావితం చేస్తుంది.నెక్సాన్ కారు సిటీలో లీటరుకు 9.1 కిలోమీటర్ల మైలేజీని మరియు హైవేపై 16.6 కిలోమీటర్ల మైలేజీని అందిస్తుంది.
కియా సోనెట్
కియా సోనెట్ఈ సంవత్సరం కాస్మటిక్ మార్పులు, ఎడాస్ (ఏడీఏఎస్) వంటి మరిన్ని ఫీచర్లతో అప్ డేట్ చేయబడింది. హ్యుందాయ్ వెన్యూ కారు లాగేఈ కారు కూడా 6-స్పీడ్ ఐఎంటిలేదా 7-స్పీడ్ డిసిటితో 1.0-లీటర్ టర్బో-పెట్రోల్‌ను పొందింది. ఇందులోని స్మార్ట్ స్ట్రీమ్జి1.0టి-జిడిఐపెట్రోల్ ఇంజిన్ ఒక సైలెంట్ మరియు రిఫైన్డ్ ఇంజన్ గా రాగా, ఇది 120bhp మరియు 172Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇది మిడ్-రేంజ్ కార్ల కోసం ట్యూన్ చేయబడింది, కాబట్టి మీరు ముందుకు వెళ్లడానికి కారు యాక్సలరేటర్ ని నిరంతరం తొక్కాల్సిన అవసరం లేదు. సోనెట్ కారు లీటరుకు 19.2 కిలోమీటర్ల మైలేజీ అందిస్తుందని ఏఆర్ఏఐ ద్వారా క్లెయిమ్ చేయబడగా, సిటీలో లీటరుకు 9.84 కిలోమీటర్ల మైలేజీనిమరియు హైవేపై 17.72 కిలోమీటర్ల మైలేజీని అందిస్తుంది.
రెనాల్ట్ కైగర్
ఈ కాంపాక్ట్ ఎస్‍యూవీ 99bhp పవర్ ని మరియు 160Nm టార్క్‌ను ఉత్పత్తి చేసే 1.0-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్‌ని పొందింది. ఈ 3-సిలిండర్ ఇంజిన్ మోస్ట్ రీఫైన్డ్ ఇంజిన్‌లలో ఒకటి అని చెప్పలేము కానీ, ఏ డ్రైవింగ్ మోడ్‌లోనైనా చాలా సైలెంట్ గా ఉంటుంది. దాని షిఫ్ట్ క్వాలిటీతో సివిటి గేర్‌బాక్స్ చాలా స్మూత్‌గా అనిపిస్తుంది. పవర్ ని జనరేట్ చేయడానికి కూడా ఇది బాగా ఉపయోగపడుతున్నట్లు అనిపిస్తుంది. రెనాల్ట్ కైగర్ కారు సిటీలో లీటరుకు 10.38 కిలోమీటర్ల రియల్-వరల్డ్ మైలేజీని మరియు హైవేపై 17.38 కిలోమీటర్ల రియల్-వరల్డ్ మైలేజీని అందిస్తుంది.
నిసాన్ మాగ్నైట్
టర్బో పవర్‌తో కూడిన ఈ చిన్న కారు కోసం మరియు బెస్ట్ పెర్ఫార్మెన్స్ అందించే కారు కోసం మీరు చూస్తున్నట్లయితే, మీరు ఖచ్చితంగా టర్బో మాగ్నైట్‌ను ఇష్టపడతారు. ఎందుకంటే, ఈ కారు 1,039 కిలోల బరువును కలిగి ఉండి, 100bhp పవర్ ని జనరేట్ చేస్తుంది.ఇది మోస్ట్ పవర్ ఫుల్ ఇంజిన్ ని కలిగి ఉంది. నిసాన్ మాగ్నైట్ కారు మంచి మైలేజీని అందిస్తుండగా, సిటీలో లీటరుకు 12.74 కిలోమీటర్ల రియల్-వరల్డ్ మైలేజీని మరియు హైవేపై 18.24 కిలోమీటర్ల రియల్-వరల్డ్ మైలేజీని అందిస్తుంది.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్