- మరింత తగ్గుతున్న వెయిటింగ్ పీరియడ్
- మొట్ట మొదటి సారిగా సోలిహుల్ యూకే బయట ఉత్పత్తి కానున్న మోడల్
ఇండియాలో లగ్జరీ బ్రాండ్ ప్రొడక్షన్ జాగ్వార్ ల్యాండ్ రోవర్ దాని ఫ్లాగ్‌షిప్ మోడల్స్, రేంజ్ రోవర్ మరియు రేంజ్ రోవర్ స్పోర్ట్‌లను, టాటా మోటార్స్ యాజమాన్యంలోని ద్వారా లోకల్ గా అసెంబుల్ చేస్తున్నట్లు ప్రకటించింది. అలాగే, సోలిహుల్ యూకేనుండి కాకుండా, బయట ఈ మోడల్స్ ప్రొడక్షన్ ని ప్రారంభించడం ఇదే మొదటిసారి అని చెప్పవచ్చు. ఇలా చేయడం ద్వారా , రేంజ్ రోవర్ ఎస్‌యువిలపై రూ. 56 లక్షల వరకు ధర భారీగా తగ్గింది .అలాగే, ఈ మోడల్స్ పై వెయిటింగ్ పీరియడ్ మరింత తగ్గనుంది.
మన దేశంలో అసెంబుల్ చేయబడిన రేంజ్ రోవర్ ఆటోబయోగ్రఫీ వెర్షన్ 3.0-లీటర్ పెట్రోల్ తో మరియు HSE వేరియంట్ 3.0-లీటర్ డీజిల్ ఇంజిన్‌తో అందుబాటులో ఉంది. ఈ రెండు పవర్‌ట్రెయిన్స్ వరుసగా 394bhp మరియు 550Nm టార్క్ మరియు 346bhp మరియు 700Nm టార్క్ ఉత్పత్తి చేయగలవు. మరోవైపు, రేంజ్ రోవర్ స్పోర్ట్ పెట్రోల్ మరియు డీజిల్ పవర్‌ట్రెయిన్ ఆప్షన్స్ తో డైనమిక్ SE వేరియంట్ కూడా అందుబాటులో ఉంది.
మరో వైపు, రేంజ్ రోవర్ డెలివరీ ఇంతకు ముందే ప్రారంభమైంది. అయితే మరోవార్తలో, రేంజ్ రోవర్ స్పోర్ట్‌ను బుక్ చేయాలనుకుంటున్న కస్టమర్‌లు ఈ మోడల్ ను బుక్ చేసుకున్న రోజు నుంచి, డెలివరీ కోసం ఆగస్ట్ 16, 2024 వరకు వేచి ఉండాల్సి ఉంది.
ధరల విషయానికొస్తే, ఇప్పుడు రేంజ్ రోవర్ రూ. 2.36 కోట్లు ప్రారంభ ధరతో, రేంజ్ రోవర్ స్పోర్ట్ రూ. 1.40 కోట్లు ప్రారంభ ధరతో, రేంజ్ రోవర్ వెలార్ రూ. 87.90 లక్షలు ప్రారంభ ధరతో, మరియు రేంజ్ రోవర్ ఎవోక్ రూ. 67.90 లక్షలు (అన్ని ధరలు, ఎక్స్-షోరూమ్)ప్రారంభ ధరతో పొందవచ్చు.
ఈ సందర్భంగా జెఎల్‌ఆర్ చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ లెన్నార్డ్ హూర్నిక్ మాట్లాడుతూ; 'గత కొన్ని సంవత్సరాలుగా, ఇండియా స్థిరమైన మరియు అద్భుతమైన ఆర్థిక వృద్ధిని సాధించింది మరియు భవిష్యత్తులో కూడా స్థిరంగా అభివృద్ధి చెందడానికి సిద్ధంగా ఉంది అని, ఈ పెరుగుదల ప్రొడక్టును స్థానికీకరించడానికి మరియు ఇండియన్ కస్టమర్లకు అద్భుతమైన అవకాశాలను అందించిందిఇండియాలో రేంజ్ రోవర్ మరియు రేంజ్ రోవర్ స్పోర్ట్ ప్రొడక్షన్ తయారీ ద్వారా బ్రాండ్ దేశంలో మరింత కావాల్సిన మోడరన్ లగ్జరీ ఎస్‌యువి కుటుంబంగా దాని స్థానాన్ని సుస్థిరం చేసుకునే దిశగా అడుగులు వేస్తుంది.” అని తెలియజేసారు.
అనువాదించిన వారు: రాజపుష్ప