- ఒకే ఒక్క, ఫుల్లీ లోడెడ్వేరియంట్ లో లభ్యం
- పెట్రోలు మరియు డీజిల్ రెండింట్లో లభించనున్న మోడల్
జెఎల్ఆర్ ఇండియా అప్‌డేటెడ్ రేంజ్ రోవర్ ఎవోక్‌ను ఇండియాలో ధర రూ. 67.90 లక్షలు (ఎక్స్-షోరూమ్) తో లాంచ్ చేసింది. ఇది రెండు ఇంజిన్ ఆప్షన్‌లలో లభిస్తుంది, ఈ 5-సీటర్ లగ్జరీ ఎస్‍యూవీ 5 పెయింట్ కలర్స్ తో అందుబాటులో ఉంది.
డిజైన్ పరంగా చూస్తే, ఎవోక్ యొక్క 2024 ఇటరేషన్ స్పోర్ట్స్ కూపేలో ప్రత్యేకంగా సిల్హౌట్, ఫ్లోటింగ్ రూఫ్, సరికొత్త డిజైన్ ను పొందిన ఫ్రంట్ గ్రిల్, సిగ్నేచర్ డిఆర్ఎల్ఎస్ తో కూడిన కొత్త ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్స్, రెడ్ బ్రేక్ కాలిపర్స్ మరియు డైమండ్-కట్ అల్లాయ్ వీల్స్ వంటివి ఉన్నాయి. అలాగే, అదనంగా ఇది కొరింథియన్ బ్రాంజ్ మరియు ట్రిబెకా బ్లూ అనే రెండు కొత్త ఎక్స్‌టీరియర్ కలర్స్ ను పొందింది.
లోపలి భాగంలో, కొత్త జనరేషన్ పివి ప్రో టెక్నాలజీతో కూడిన 11.4-ఇంచ్ కర్వ్డ్ గ్లాస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్, టూ-జోన్ క్లైమేట్ కంట్రోల్, హీటెడ్ మరియు వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్స్, వైర్‌లెస్ ఛార్జర్, క్యాబిన్ ఎయిర్ ప్యూరిఫైయర్, 3D సరౌండ్ వ్యూ మరియు క్లియర్‌సైట్ గ్రౌండ్, వెనుక వైపు నుంచి వ్యూ మిర్రర్ ఉన్నాయి.
న్యూ రేంజ్ రోవర్ ఎవోక్ రెండు పవర్‌ట్రెయిన్ ఆప్షన్స్ తో అందుబాటులో ఉంది. ఇందులో 247bhp మరియు 365Nm టార్క్‌నుఉత్పత్తి చేసే 2.0-లీటర్ గ్యాసోలిన్ మోటార్ మరియు 201bhp మరియు 430Nm టార్క్‌ను ఉత్పత్తి చేసే 2.0-లీటర్ డీజిల్ ఇంజిన్ ఉన్నాయి.
ఈ సందర్భంగా జెఎల్ఆర్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ రాజన్ అంబ మాట్లాడుతూ, “ తక్కువ ఇంటీరియర్‌లు, సౌకర్యవంతమైన క్యాబిన్ మరియు ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌లలో సరికొత్త రూపంతో, న్యూ రేంజ్ రోవర్ ఎవోక్ మా విలువైన కస్టమర్లకు మంచి అనుభవాన్ని అందిస్తుందని విశ్వసిస్తున్నాము, ఆకర్షణీయమైన డిజైన్ అంశాలు, క్లీనర్ ఎయిర్ టెక్నాలజీలు మరియు సులువుగా పనిచేసే కంట్రోల్ యొక్క ఆటోమోటివ్ చక్కటి ఉదాహరణ, ఇలాంటి మంచి పరిణామాన్ని పరిచయం చేయడానికి మేము సంతోషిస్తున్నాము, ప్రతి ఒక్క ప్రయాణం కేవలం డ్రైవ్ మాత్రమే కాదు, విలాసవంతమైన మరియు ఆవిష్కరణలతో కూడిన ఒక అద్భుతమైన ప్రయాణంగా ఉండాలి”అని తెలియజేసారు.
అనువాదించిన వారు: రాజపుష్ప