- జూలై 19న టాటా కర్వ్ అధికారిక ఆవిష్కరణ
- ఆగస్టు 7న కర్వ్ ఈవీ లాంచ్, ధరల ప్రకటన
టాటా మోటార్స్ రాబోయే (అప్ కమింగ్) కర్వ్ కూపే ఎస్‍యూవీకి సంబంధించి మరొక టీజర్ ని రిలీజ్ చేసింది. ఈ కొత్త వీడియోలో దాని డిజైన్ స్కెచ్, అలాగే దాని స్టైలింగ్ వివరాలను కూడా వెల్లడించింది.
ప్రొడక్షన్ వెర్షన్ టాటా కర్వ్ ఈ సంవత్సరం ప్రారంభంలో భారత్ మొబిలిటీ ఎక్స్ పోలో ప్రదర్శించబడిన ప్రీ-ప్రొడక్షన్ యూనిట్ లాగే ఉంది. స్కెచ్ ఫోటోలను చూస్తే ఈ కూపే ఎస్‍యూవీ ఎల్ఈడీ లైట్ బార్ తో ప్రత్యేకమైన ఫ్రంట్ ఎండ్ ని కలిగి ఉంది. ఇంకా ఇందులోని ఇతర హైలైట్ అంశాలలో స్లోపింగ్ రూఫ్, ఫ్లష్-ఫిట్టింగ్ డోర్ హ్యండిల్స్, మరియు ప్రత్యేక స్టైల్ తో కొత్త అల్లాయ్ వీల్స్ సెట్ వంటివి ఉన్నాయి. 10.25-ఇంచ్ టచ్ స్క్రీన్ సెంటర్ స్టేజ్ మరియు టూ-స్పోక్ స్టీరింగ్ వీల్ వంటి వాటితో చాలా తక్కువ మొత్తంలో ఇంటీరియర్ మార్పులను కలిగి ఉంది. ఈ కర్వ్ మోడల్ ఎడాస్ (ఏడీఏఎస్), మరియు ఇతర సేఫ్టీ ఫీచర్లతో అందించబడుతుందని భావిస్తున్నాం.
నెక్సాన్ కంటే బెటర్ ఫీచర్స్ మరియు స్పెసిఫికేషన్లతో టాటా కర్వ్ మోడల్ రానుండగా, కన్వెన్షనల్ పెట్రోల్ మరియు డీజిల్ డీజిల్ పవర్ ట్రెయిన్లు మరియు ఈవీ వెర్షన్ తో రానుంది. ఇంతకు ముందు టీజర్ ద్వారా ఈ కూపే ఎస్‍యూవీ 2024 జూలై 19వ తేదీన ఆవిష్కరణ జరుగుతుందని నిర్ధారణ కాగా, ఆగస్టు 7వ తేదీన దాని ఈవీ వెర్షన్ లాంచ్ కానుంది.
పవర్ ట్రెయిన్ ఆప్షన్స్
టాటా కర్వ్ ఐసీఈ వెర్షన్ లో 1.2-లీటర్ టర్బో-పెట్రోల్ మరియు 1.5-లీటర్ డీజిల్ ఇంజిన్లు మాన్యువల్ మరియు ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్లతో జతచేయబడి అందించబడే అవకాశం ఉంది. మరోవైపు, కర్వ్ ఈవీ బ్రాండ్ “Acti.ev” ఆర్కిటెక్చర్ ఆధారంగా వస్తుండగా, 500 కిలోమీటర్లకు పైగా డ్రైవింగ్ రేంజ్ ని అందించడానికి 55kWh బ్యాటరీ ప్యాక్ తో వచ్చే అవకాశం ఉంది.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్