- ఆగస్టు 2న అధికారిక అరంగేట్రం
- 1.2-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ ని పొందనున్న బసాల్ట్
బసాల్ట్ కూపే ఎస్‍యూవీ ఆగస్టు 2వ తేదీన ఆరంగేట్రం చేయనుండగా, దాని కంటే ముందుగా ప్రొడక్షన్ టైపులో ఉన్న దీని పూర్తి వివరాలను సిట్రోన్ కంపెనీ అధికారికంగా వెల్లడించింది. ఇది ఇండియాలో సి-క్యూబ్ ప్రోగ్రాం కింద సిట్రోన్ నుంచి వస్తున్న నాలుగవ మోడల్ కాగా, ఫ్రెంచ్ ఆటోమేకర్ నుంచి వస్తున్న బడ్జెట్ ఫ్లాగ్ షిప్ మోడల్.
ఇక్కడ కనిపిస్తున్న ఫోటోలలో ప్రొఫైల్, వీల్స్ డిజైన్, మరీ ముఖ్యంగా సి-పిల్లర్ బాడీ షేప్ వంటి వాటి పరంగా చాలా వరకు మనం స్పై ఫోటోల ద్వారా చూశాము. ఇది ఒక సరికొత్త షేప్ ని మోడల్ కి అందిస్తుంది. ఇంకా కనిపిస్తున్న అంశాలలో రియర్ స్పాయిలర్, కన్వెన్షనల్ డోర్ హ్యండిల్స్ మరియు రాప్-అరౌండ్ టెయిల్ ల్యాంప్స్ వంటివి ఉన్నాయి. దీని ముందు భాగం చూస్తే, ఎల్ఈడీ డీఆర్ఎల్స్ మరియు ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ ని బట్టి కొంత వరకుC3 ఎయిర్ క్రాస్ లాగా కనిపిస్తుంది.
అలాగే మీరు ఇంటీరియర్లో అందించిన క్యాబిన్ ని పరిశీలిస్తే, డిజిటల్ క్లస్టర్, ఇందులోని 10.25-ఇంచ్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టం, మరియు క్లైమేట్ కంట్రోల్ సిస్టం బీజ్ కలర్ తో వస్తున్నట్లు నిర్ధారణ అయ్యింది. కొనుగోలుదారులు ముందు సీట్లలో మరియు వెనుక సీట్లలో ఆర్మ్‌రెస్ట్‌లను, అదే విధంగా డ్యూయల్ కప్ హోల్డర్‌లను కూడా పొందుతారు.
ఇక్కడ అందించిన ఫోటోల ద్వారా నిర్ధారణ అయ్యింది ఏంటి అంటే, సిట్రోన్ బసాల్ట్ కారు 1.2-లీటర్ ప్యూర్ టెక్ 110 టర్బో ఇంజిన్ 109bhp మరియు 205Nm టార్కును ఉత్పత్తి చేస్తుండగా, ఈ ఇంజిన్ ని 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ మరియు 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్లతో జతచేసి పొందవచ్చు. సిట్రోన్ బ్రాండ్ నుంచి వస్తున్న బసాల్ట్ కారు హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, ఎంజి ఆస్టర్, మారుతి గ్రాండ్ విటారా, టయోటా హైరైడర్ మరియు హోండా ఎలివేట్ వంటి కార్లకు గట్టి పోటీని ఇవ్వనుంది.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్