- 2025 మొదటి త్రైమాసికంలో లాంచ్ అయ్యే అవకాశం
- ఐసీఈ హారియర్ వలె డాష్‌బోర్డ్ లేఅవుట్‌ను పొందుతున్న ఎలక్ట్రిక్ హారియర్
టాటా మోటార్స్ కొత్త హారియర్ ఈవీ డిజైన్‌లో మార్పులు చోటుచేసుకుంటుండగా, దాని పాపులర్ ఎస్‍యూవీ ఎలక్ట్రిక్ వెర్షన్ పై పనిని కొనసాగిస్తుంది. అలాగే, 2025 మొదటి త్రైమాసికంలో దానిని ఇండియన్ మార్కెట్‌లోకి లాంచ్ చేయడానికి షెడ్యూల్ చేయబడగా, లాంచ్‌కు ముందు ,ప్రొడక్షన్ కి రెడీ ఉన్న హారియర్ ఈవీ కొత్త స్పై షాట్‌లలో ఎస్‍యూవీ ఇంటీరియర్ కి సంబంధించిన కొన్ని ముఖ్యమైన ఫీచర్లను వెల్లడించాయి.
ఇక్కడ చిత్రంలో చూసినట్లుగా, ఎలక్ట్రిక్ హారియర్ డాష్‌బోర్డ్ లేఅవుట్ ఐసీఈ వెర్షన్ వలె సమానంగా లేఅవుట్‌ను కలిగి ఉంటుంది. ఇందులో 12.3-ఇంచ్ పెద్ద ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వైర్‌లెస్ ఛార్జర్, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్‌ప్లే కనెక్టివిటీ, ఫోర్-స్పోక్ స్టీరింగ్ వీల్, డ్యాష్‌బోర్డ్-మౌంటెడ్ స్పీకర్, టచ్-బేస్డ్ హెచ్ విఎసి ప్యానెల్, ఆటో హోల్డ్‌తో కూడిన ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, స్టబ్బీ గేర్ సెలెక్టర్ లివర్ మరియు డ్రైవ్ మోడ్‌ల కోసం రోటరీ డయల్ వంటి కొన్ని అంశాలు ఉన్నాయి. ఇక్కడ గుర్తించవలసిన మరొక అంశం ఏమిటంటే, దీని డ్యాష్‌బోర్డ్ యెల్లో కలర్ ను కలిగి ఉంది.
అంతేకాకుండా, ఐసీఈ వెర్షన్ మాదిరిగానే, ఎలక్ట్రిక్ హారియర్ కూడా పెద్ద పనోరమిక్ సన్‌రూఫ్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, బ్లైండ్ స్పాట్ మానిటర్‌తో కూడిన 360-డిగ్రీ సరౌండ్ కెమెరా మరియు లెవెల్ 2 ఏడీఏఎస్(ఎడాస్)సూట్ వంటి ఫిచర్లతో రానుంది.
హారియర్ ఈవీ కి సంబంధించి పూర్తి టెక్నికల్ స్పెసిఫికేషన్ల వివరాలు ప్రస్తుతానికి టాటా వెల్లడించలేదు. అయితే, ఇప్పటివరకు మనకు తెలిసిన విషయం ఏమిటంటే, హారియర్ ఈవీ అనేది ఆటోమేకర్ నుండి ఆర్‍డబ్ల్యూడి కాన్ఫిగరేషన్‌తో అందించబడే మొదటి ఎలక్ట్రిక్ ఎస్‌యువి ఇదే. అంతేకాకుండా, కర్వ్ ఈవీ ఇప్పుడు 585 కిలోమీటర్ల ఏఆర్ఏఐ- సర్టిఫైడ్ డ్రైవింగ్ రేంజ్ బ్యాటరీ ప్యాక్‌ను కలిగి ఉంది. అలాగే, హారియర్ ఈవీని ఒకేసరి పూర్తిగా ఛార్జ్ చేస్తే, సుమారు 600కిలోమీటర్ల రేంజ్ ని అందించగలదని మేము భావిస్తున్నాం.
అనువాదించిన వారు: రాజపుష్ప