- 6 నవంబర్, 2024లో ఇండియాలో వచ్చే అవకాశం
- టాటా నెక్సాన్ మరియు మారుతి సుజుకి బ్రెజాతో పోటీపడనున్న స్కోడా కైలాక్
స్కోడా ఇండియా దాని సరికొత్త ప్రొడక్షన్ రెడీ కైలాక్ ఎస్‌యువిని చురుకుగా టెస్టింగ్ చేస్తుంది. ఈ సబ్-ఫోర్ మీటర్ ఎస్‌యువి 2024 నవంబర్ మొదటి వారంలో ఇండియన్ మార్కెట్లో అరంగేట్రం చేయడానికి సిద్ధంగా ఉంది. దాని లాంచ్ కి ముందుగా, ఆటోమేకర్ ప్రొడక్షన్ కి రెడీగా ఉన్న కైలాక్ మోడల్ ను ఇటీవల భారీగా కురుస్తున్న వర్షంలో టెస్టింగ్ నిర్వహిస్తూ కనిపించింది.
మెకానికల్‍గా, స్కోడా కైలాక్ బ్రాండ్ ద్వారా టెస్టింగ్ నిర్వహించిన1.0-లీటర్ టిఎస్ఐ పెట్రోల్ ఇంజిన్‌ని పొందింది. కుషాక్ ఎస్‌యువి లో ఉన్న ఇదే మోటార్ కైలాక్ లో 114bhp మరియు 178Nm మాక్సిమం టార్క్ ను అవుట్‌పుట్‌తో ఉత్పత్తి చేస్తుంది. ఇందులో ట్రాన్స్‌మిషన్ ఆప్షన్స్ విషయానికొస్తే, కైలాక్ 6-స్పీడ్ మాన్యువల్ తో ఇంజిన్‌ని జత చేసిన ఆటోమేటిక్ టార్క్ కన్వర్టర్ గేర్‌బాక్స్‌ను పొందుతుంది.
ఫోటోలలో మరియు మునుపటి టీజర్‌లలో కనిపిస్తున్నట్లుగా, కొత్త కైలాక్ కారు, కుషాక్ కారు వలె స్ప్లిట్ ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్స్, గ్రిల్‌పై నిలువుగా అమర్చి ఉండే స్లాట్‌లతో కూడిన సన్నని ఎల్ఈడీ డిఆర్ఎల్స్, నిటారుగా ఉండే బానెట్, రూఫ్ రెయిల్స్ మరియు ఎలక్ట్రిక్ సన్‌రూఫ్ వంటి కొన్ని డిజైన్ హైలైట్స్ వంటివి ఉన్నాయి.
ఫీచర్ల పరంగా చూస్తే, స్కోడా కైలాక్ పెద్ద ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్, వైర్‌లెస్ స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ ప్యానెల్, యాంబియంట్ లైటింగ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, 360-డిగ్రీ సరౌండ్ కెమెరా, వైర్‌లెస్ ఛార్జర్, రియర్ ఏసీ వెంట్స్ వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్స్ వంటి వాటితో కూడిన సరికొత్త క్యాబిన్‌ను పొందవచ్చని భావిస్తున్నాం.
అలాగే లాంచ్ తర్వాత, కొత్త కైలాక్ టాటా నెక్సాన్, మారుతి బ్రెజా, కియా సోనెట్, హ్యుందాయ్ వెన్యూ, సిట్రోన్ బసాల్ట్, మహీంద్రా XUV 3XO మరియు అప్ కమింగ్ (రాబోయే) నిస్సాన్ మాగ్నైట్ వంటి వాటితో గట్టి పోటీతో నిలుస్తుంది.
అనువాదించిన వారు: రాజపుష్ప