- ఆగస్టు 15న ఇండియాలో లాంచ్ కానున్న ఫైవ్- డోర్ థార్
- లాంచ్ సమయానికి ఈ మోడల్ డ్యూయల్ పేన్ సన్‌రూఫ్ పొందే అవకాశం
మరోసారి మహీంద్రా థార్ ఫైవ్-డోర్ కి సంబంధించిన తాజా వివరాలు అందుబాటులోకి వచ్చాయి. ఈ ఏడాది ఆగస్టు 15న దీని ధరను వెల్లడించనుండగా, దాని కంటే ముందే, ప్రొడక్షన్ రెడీ అవతార్‌లో ఈ కారు టెస్ట్ యూనిట్లు టెస్టింగ్ చేస్తూ కనిపించాయి.
ఇక్కడ చిత్రాలలో చూసినట్లుగా, థార్ ఫైవ్-డోర్ టెస్ట్ మ్యూల్స్ చుట్టూ భారీగా కామోఫ్లేజ్ తో కప్పబడి అనేక (పొరలుగా)లేయర్లతో కనిపించాయి. అదే విధంగా, కొంతవరకు కవర్ చేసి ఉన్నపటికీ మనకు రెడ్ మరియు బ్లాక్ కలర్స్ వంటి కలర్ ఆప్షన్స్ లో లైఫ్‌స్టైల్ ఎస్‌యువి అప్ కమింగ్ (రాబోయే)ఇటరేషన్ ని అందించబడతాయి. అయితే ఈ మోడల్ లాంచ్ సమయానికికనీసం 5 నుండి 6 ఆప్షన్స్ లైనప్‌తో వస్తుందని మేము ఆశిస్తున్నాము.
మరోవైపు, ఫైవ్-డోర్ థార్ యూనిట్లలో కనిపించే ముఖ్యమైన వివరాలలో హెడ్‌ల్యాంప్ క్లస్టర్‌తో కూడిన సర్క్యులర్ ఎల్ఈడీ డీఆర్ఎల్ఎస్, న్యూ మల్టీ-స్లాట్ గ్రిల్, సైడ్ స్టెప్స్, డ్యూయల్-టోన్ ఫినిషింగ్ దాని త్రీ –డోర్ నుండి తీసుకోగా, అల్లాయ్ వీల్స్ కోసం ఫెండర్-మౌంటెడ్ టర్న్ ఇండికేటర్స్, ప్లాస్టిక్ క్లాడింగ్, న్యూ ఎల్ఈడీ టెయిల్‌లైట్స్ మరియు టెయిల్‌గేట్-మౌంటెడ్ స్పేర్ టైర్ కోసం కవర్ వంటి కీలక వివరాలు ఉన్నాయి.
లోపలి భాగంలో, 2024 థార్ ఫైవ్-డోర్ పెద్ద టచ్‌స్క్రీన్ యూనిట్, డ్యూయల్ పేన్ సన్‌రూఫ్ ( లోయర్ వేరియంట్‌లలో సింగిల్ పేన్ యూనిట్), ఫ్రంట్ ఆర్మ్‌రెస్ట్, యూఎస్‌బి టైప్-సి ఛార్జింగ్ పోర్ట్స్, బి-పిల్లర్-మౌంటెడ్ రియర్ డోర్ హ్యాండిల్స్, డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, మరియు ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ వంటి ఫీచర్లను పొందవచ్చని భావిస్తున్నారు.
త్రీ –డోర్ వెర్షన్ మాదిరిగా ఉండే, ఫైవ్ –డోర్ మహీంద్రా థార్ 6-స్పీడ్ మాన్యువల్ మరియు ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌లతో జత చేయబడిన 2.0-లీటర్ టర్బో-పెట్రోల్ మరియు 2.2-లీటర్ డీజిల్ ఇంజిన్‌లను పొందే అవకాశం ఉంది. ఇది ఫోర్స్ గూర్ఖా ఫైవ్-డోర్ కి మాత్రమే పోటీ కాకుండా, హ్యుందాయ్ క్రెటా, మారుతి గ్రాండ్ విటారా, కియా సెల్టోస్, స్కోడా కుషాక్, ఫోక్స్‌వ్యాగన్ టైగున్ మరియు ఎంజి ఆస్టర్ వంటి ట్రెడిషనల్ మిడ్-సైజ్ ఎస్‌యువిలతో కూడా పోటీపడుతుంది.
అనువాదించిన వారు: రాజపుష్ప