- హెడ్‌ల్యాంప్స్ మరియు టెయిల్‌లైట్స్ లో మార్పులు పొందే అవకాశం
- 2025 ప్రారంభంలో లాంచ్ అయ్యే అవకాశం
కియా దాని ఎంట్రీ-లెవల్ ఎంపివి, కారెన్స్ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌పై తన పనిని కొనసాగిస్తుంది. ఈ మూడు వరుసల కార్ టెస్ట్ మ్యూల్ భారీగా కామోఫ్లేజ్ తో కప్పబడి ఉండగా, ఇది సౌత్ కొరియాలో టెస్టింగ్ చేస్తూ కనిపించింది. కారెన్స్ ఫేస్‌లిఫ్ట్ 2025 ప్రారంభంలో ఇండియన్ మార్కెట్లోకి ప్రవేశిస్తుందని భావిస్తున్నారు.
స్పై చిత్రాలలో చూసినట్లుగా, కారెన్స్ ఫేస్‌లిఫ్ట్ రీపోజిషన్డ్ హెడ్‌ల్యాంప్స్ మరియు ట్వీక్ చేయబడిన ఎల్ఈడీ డిఆర్ఎల్ఎస్ తో రివైజ్ చేయబడిన ఫ్రంట్ ఫాసియాని పొందుతుంది. అలాగే, ఇది సన్ రూఫ్ ని మిస్ అవుతుండగా, ఎల్ఈడీలకు బదులుగా స్పోర్ట్స్ హాలోజన్ హెడ్‌ల్యాంప్‌లను పొందడంతో లోయర్-స్పెక్ వేరియంట్‌గా కనిపిస్తుంది.
సైడ్ ప్రొఫైల్ చూస్తే, బ్లాక్ క్లోత్ తో కప్పబడినప్పటికీ,ఇది ఒకే విధమైన సిల్హౌట్ ని కలిగి ఉండడంతో కొద్దిగా కూడా మార్పులు పొందలేదు అని చెప్పవచ్చు. అలాగే, కారు వెనుకవైపు హైలైట్‌లలో రివైజ్డ్ ఇన్‌వర్టెడ్-ఎల్- షేప్డ్ ఎల్ఈడీ టెయిల్‌ల్యాంప్స్, షార్క్-ఫిన్ యాంటెన్నా మరియు రూఫ్ రెయిల్స్ ఉన్నాయి.
ఫీచర్ల విషయానికి వస్తే, కియా కారెన్స్ లెవల్ 2 ఏడీఏఎస్ (ఎడాస్) సూట్, 360-డిగ్రీ సరౌండ్ కెమెరా, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్స్, పవర్డ్ డ్రైవర్ సీట్, డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్, ఇన్ఫోటైన్‌మెంట్ కోసం ట్విన్ డిస్‌ప్లే మరియు ఇన్‌స్ట్రుమెంట్ పానెల్, యాంబియంట్ లైటింగ్, వైర్‌లెస్ ఛార్జర్ మరియు ఎలక్ట్రిక్ సన్‌రూఫ్ వంటి ఫీచర్లను పొందే అవకాశం ఉంది.
పవర్‌ట్రెయిన్ ఆప్షన్స్ విషయానికొస్తే, ప్రస్తుత ఇంజిన్ ఆప్షన్‌లలో కియా ఎలాంటి మెకానికల్ మార్పులు చేస్తుందని మేము భావించడం లేదు.లాంచ్ అయిన తర్వాత, కారెన్స్ ఫేస్‌లిఫ్ట్ ఎంపివి క్లాస్‌లో మారుతి సుజుకి ఎర్టిగా, మారుతి సుజుకి XL6, మహీంద్రా మరాజో మరియు టయోటా ఇన్నోవా క్రిస్టాలతో పోటీని కొనసాగిస్తుంది.
అనువాదించిన వారు: రాజపుష్ప