- కొత్త అల్కాజార్ వలె అదే పవర్‌ట్రెయిన్ తో కొనసాగుతున్న
- స్టాక్‌లో ఉన్న సెలెక్ట్ చేసిన వేరియంట్‌లపై మాత్రమే అందుబాటులో ఉన్న ఆఫర్స్
హ్యుందాయ్ మోటార్ ఇండియా ఇటీవల సరికొత్తగా అప్‌డేటెడ్ అల్కాజార్‌ను ఇండియన్ మార్కెట్లోకి లాంచ్ చేసింది.దీనిని రూ. 14.99 లక్షల ఎక్స్-షోరూమ్ ప్రారంభ ధరతో పొందవచ్చు. ఇప్పుడు, ఈ మూడు వరుసల ఎస్‌యువి కొత్త ఫీచర్లు, రివైజ్డ్ ఎక్స్‌టీరియర్ స్టైలింగ్ మరియు మునుపటి పవర్‌ట్రెయిన్ ఆప్షన్స్ తో అందుబాటులో ఉంది.
కొత్త అల్కాజార్ లాంచ్ అయిన తర్వాత, ఎస్‌యువి ప్రీ-ఫేస్‌లిఫ్టెడ్ వెర్షన్ అమ్మకాలలో ఉన్నపటికీ , ఇది భారీ డిస్కౌంట్లతో అందుబాటులో ఉంది. అలాగే, సెలెక్టెడ్ వేరియంట్స్ పై రూ.2.5 లక్షల వరకు బెనిఫిట్స్ పొందవచ్చు. ఓల్డ్ అల్కాజార్ రూ. 55,000 డిస్కౌంట్లతో అధికారిక అందుబాటులో ఉంది. అయితే, మిగిలిన స్టాక్‌ను క్లియర్ చేయడానికి, డీలర్‌షిప్స్ వద్ద ఉన్న ఓల్డ్ హ్యుందాయ్ అల్కాజర్ కొనుగోలుపై రూ. 2 లక్షల వరకు డిస్కౌంట్ ని పొందవచ్చు. అలాగే , ఎక్స్ఛేంజ్ బోనస్స్ , కార్పొరేట్ డిస్కౌంట్స్ మరియు మరిన్ని ఇతర బెనిఫిట్ ని పొందవచ్చు. ఈ ఆఫర్‌లు తాత్కాలికం కాగా, వేరియంట్, ప్రాంతం, స్టాక్ లభ్యత మరియు ఇతర అంశాలపై ఆధారపడి మారవచ్చు. మాకు అందిన సమాచారం ప్రకారం, షోరూమ్‌లలో మిగిలి ఉన్న స్టాక్‌లో ఎక్కువ భాగం వరకు ప్లాటినం, ప్లాటినం (O), మరియు సిగ్నేచర్ అనే వేరియంట్ మాత్రమే కాగా, ఇవి పెట్రోల్ మరియు డీజిల్ వెర్షన్ లో ఉన్నాయి.
కొత్త అల్కాజార్ మరిన్ని ఫీచర్లతో అప్‌డేట్ చేయబడిన డిజైన్ ను పొందినప్పటికీ, ఆల్కాజర్ మొదటి ఇటరేషన్ పెద్ద పనోరమిక్ సన్‌రూఫ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్స్ , బ్లైండ్ స్పాట్ మానిటర్‌తో కూడిన 360-డిగ్రీ సరౌండ్ కెమెరా, పెద్ద ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, మరియు ఎలక్ట్రికల్‌గా సర్దుబాటు చేయగల డ్రైవర్ సీట్ వంటి ఫీచర్లతో దాని కేటగిరిలోని అత్యంత ఫీచర్-రిచ్ ఎస్‌యువిలలో ఒకటిగా పరిగణించబడింది.
కొలతల వారీగా, అదే వీల్‌బేస్‌తో పోల్చినప్పుడు న్యూ ఆల్కజార్ ఓల్డ్ ఆల్కాజార్ కంటే కొంచెం పెద్దది.
కొలతలు | కొత్త అల్కాజార్ | ఓల్డ్ అల్కాజార్ |
పొడవు | 4,560మి.మీ | 4,500మి.మీ |
వెడల్పు | 1,800మి.మీ | 1,790మి.మీ |
ఎత్తు | 1,710మి.మీ | 1,675మి.మీ |
వీల్ బేస్ | 2,760మి.మీ | 2,760మి.మీ |
మెకానికల్‍గా, అల్కాజార్ 1.5-లీటర్ పెట్రోల్ మరియు 1.5-లీటర్ డీజిల్ ఇంజిన్ అనే రెండు పవర్‌ట్రెయిన్ ఆప్షన్స్ తో ఉంది మునుపటిది 6-స్పీడ్ మాన్యువల్ మరియు 7-స్పీడ్ డిసిటిని పొందగా, రెండోది 6-స్పీడ్ మాన్యువల్ మరియు ఆటోమేటిక్ టార్క్ కన్వర్టర్ యూనిట్‌తో జత చేయబడింది. ఈ కాన్ఫిగరేషన్ కొత్త అల్కాజార్ ఫేస్‌లిఫ్ట్ ను పోలి ఉంటుంది.
అనువాదించిన వారు: రాజపుష్ప