- సింగిల్, ఫుల్లీ లోడెడ్ వేరియంట్లో లభ్యం
- ఒక్క ఫుల్ చార్జ్ తో 591 కిలోమీటర్ల దూరం వరకు సౌకర్యవంతమైన ప్రయాణం
పోర్షే ఇండియా కార్ల కంపెనీ దాని 2వ ఎలక్ట్రిక్ మోడల్ ని ఇండియాలో అందిస్తుంది. ఈసారి, బ్రాండ్ నుంచి మొదటి ఫుల్ ఎలక్ట్రిక్ ఈవీ మకాన్ టర్బో ఈవీని లాంచ్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఇది మకాన్ 4 మరియు మకాన్ టర్బో అనే రెండు వేరియంట్లలో అందుబాటులోకి రాగా, తర్వాత రూ.1.65 కోట్లు (ఎక్స్-షోరూం) ధరతో ఇండియాలో ప్రవేశించింది. ఆసక్తి కలిగిన కస్టమర్లు ఈ ఎలక్ట్రిక్ ఎస్‍యూవీని ఇప్పుడే బుక్ చేసుకునే అవకాశం ఉండగా, జూన్-2024 తర్వాత వీటి డెలివరీ ప్రారంభంకానుంది.
డిజైన్ పరంగా చెప్పాలంటే, ఎలక్ట్రిక్ మకాన్ కూడా దాని ఐసీఈ వెర్షన్ లాగానే ఉంది. ఇది స్పోర్ట్స్ లుక్ తో 4-పాయింట్ ఎల్ఈడీ డీఆర్ఎల్స్, స్ప్లిట్ ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్స్, ఫ్రేమ్‌లెస్ డోర్స్, వెనుకవైపు కనెక్టెడ్ ఎల్ఈడీబార్, కూపే-స్టైల్ బాడీ మరియు 22-ఇంచ్ అల్లాయ్ వీల్స్ వంటి ఫీచర్స్ ని కలిగి ఉంది.
ఇంకా ఇంటీరియర్ పరంగా లోపల చూస్తే, పోర్షే టర్బో ఈవీ కర్వ్డ్ 12.6-ఇంచ్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, 10.9-ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్, ఎయిర్‌కాన్ కంట్రోల్స్ కోసం ఫిజికల్ బటన్స్, హెడ్స్-అప్ డిస్ ప్లే మరియు ఫ్రంట్ ప్యాసింజర్ కోసం ఆప్షనల్ 10.9-ఇంచ్ స్క్రీన్ వంటి ఫీచర్స్ తో వచ్చింది. అదే విధంగా, ఇందులో గుర్తించాల్సిన అంశాలలో గరిష్టంగా 5 డిగ్రీల యాంగిల్ తో ఆప్షనల్ రియర్ వీల్ స్టీరింగ్, పోర్షే యాక్టివ్ సస్పెన్షన్ మేనేజ్ మెంట్, మరియు పోర్షే ట్రాక్షన్ మేనేజ్ మెంట్ వంటివి ఉన్నాయి.
800-వోల్ట్ ఆర్కిటెక్చర్ తో కొత్త ప్రీమియం ప్లాట్ ఫారం ఎలక్ట్రిక్(పీపీఈ) అధారంగా వచ్చిన మకాన్ టర్బో ఈవీ 100kWh బ్యాటరీ ప్యాక్ సహాయంతో 591 కిలోమీటర్ల డబ్లూఎల్‍టిపి-క్లెయిమ్డ్ రేంజ్ మైలేజీని అందిస్తుంది. మకాన్ టర్బో ఈవీని 270kW డిసి ఫాస్ట్ ఛార్జర్ ని ఉపయోగించి 10-80 శాతం వరకు కేవలం 21 నిమిషాల్లో చార్జ్ చేయవచ్చు. మకాన్ టర్బో ఈవీ యొక్క రెండు యాక్సిల్స్ డ్యూయల్-మోటార్ సెటప్ ద్వారా 630bhp మరియు 1130Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తాయి. ఆశ్చర్యమైన విషయం ఏంటి అంటే, ఈ ఎస్‍యూవీ కేవలం 3.3 సెకన్లలో 0-100కెఎంపిహెచ్ వేగాన్ని అందుకోగలదు.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్